ETV Bharat / bharat

రెమ్​డెసివిర్​ కోసం కిక్కిరిసిన జనం - రెమిడిసివిర్ ఇంజక్షన్లకోసం తమిళనాడులో జనాలు

రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కోసం చెన్నై జవహర్​లాల్ నెహ్రూ స్టేడియంలో జనాలు కిక్కిరిసి పోయారు. భౌతిక దూరం, కరోనా జాగ్రత్తల మాటే లేదు. పది రోజుల నుంచి ఎంత ప్రయత్నించినా రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ లభించలేదని ఓ స్థానికుడు వాపోయాడు.

Scores of people gather
కిక్కిరిసిన జనం
author img

By

Published : May 15, 2021, 7:18 PM IST

Updated : May 15, 2021, 7:52 PM IST

రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ కోసం తమిళనాడు చెన్నైలోని జవహర్​లాల్​ నెహ్రూ స్టేడియంలో జనాలు గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. భౌతిక దూరం, కరోనా జాగ్రత్తలు లాంటి నిబంధల్ని ఖాతరు చేయలేదు. రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచలేక తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ఓ బాధితుడు ఆరోపించాడు. పదిరోజులనుంచి ఎంత ప్రయత్నించినా ఇంజక్షన్​ లభించలేదని వాపోయాడు. ఈ చిత్రం చూస్తే రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు దొరక్క జనాలు ఎలా అవస్థలు పడుతున్నారో అర్థం అవుతుంది.

Remdesivir
రెమిడెసివిర్​ కోసం కిక్కిరిసిన జనం
Remdesivir
రెమిడెసివిర్​ కోసం కిక్కిరిసిన జనం
Remdesivir
రెమిడెసివిర్​ ఇంజక్షన్​ లభించలేదని వాపోయిన స్థానికురాలు

"నా కుటుంబం అంతా ఆసుపత్రిలో ఉంది. గత పదిరోజులుగా రెమ్​డెసివిర్ ఇంజక్షన్​ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఇంతవరకు నాకు లభించలేదు. ప్రభుత్వం బెడ్​నైతే ఏర్పాటు చేయగలిగింది కానీ రెమ్​డెసివిర్​ను అందుబాటులో ఉంచలేకపోయింది."

-స్థానికుడు

గూండా యాక్ట్​

రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను, ఆక్సిజన్​ సిలిండర్లను నిల్వ ఉంచినా, ప్రభుత్వం ప్రకటించిన ధరలకంటే ఎక్కువకు అమ్మిన వారిపై గూండా యాక్ట్ కింద కేసు​ నమోదు చేసి అరెస్టు చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్​ సిలిండర్లు, రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు వచ్చాయని, అందుకే ఈ చట్టాన్ని అమలు చేయాల్సి వస్తోందన్నారు.

సీఎం ఆదేశాలతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. బ్లాక్​లో, ఎక్కువ ధరలకు ఆక్సిజన్​ సిలిండర్లను, రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను అమ్ముతున్న చాలా మందిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: 'స్టిరాయిడ్ల దుర్వినియోగమే.. బ్లాక్​ ఫంగస్​కు​ కారణం'

Last Updated : May 15, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.