ETV Bharat / bharat

ఎస్​సీఓ వేదికగా పాకిస్థాన్​​, చైనాకు మోదీ హెచ్చరిక! - పీఎం మోదీ

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ల సమక్షంలో ఆయా దేశాలకు గట్టి హెచ్చరికలు పంపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పొరుగు దేశాల సౌర్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని స్పష్టం చేశారు. అనవసరంగా ద్వైపాక్షిక అంశాలను పదే పదే లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పాక్​పై పరోక్షంగా విమర్శించారు.

PM Modi in SCO summit
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Nov 10, 2020, 9:59 PM IST

షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ (ఎస్​సీఓ) 20వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా చైనా, పాకిస్థాన్​లకు గట్టి హెచ్చరికలు పంపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఒకరికొకరు సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని సూచించారు. పాకిస్థాన్​ పలు సమావేశాల్లో జమ్ముకశ్మీర్​ అంశాన్ని లేవనెత్తటాన్ని సూచిస్తూ.. ఎస్​సీఓ కూటమి సూత్రాలను ఉల్లంఘిస్తూ అనవసరంగా ద్వైపాక్షిక అంశాలను లేవనెత్తే ప్రయత్నాలు చేయటం సరికాదని పరోక్షంగా విమర్శలు చేశారు.

"దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి, ఒకరికొకరు సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించే ప్రధాన సూత్రాన్ని అనుసరించటం ద్వారా ముందుకు సాగటం చాలా ముఖ్యమని భారత్​ విశ్వసిస్తుంది. ఎస్​సీఓ చార్టర్​లో పేర్కొన్న సూత్రాలకు భారత్​ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. కానీ, ఎస్​సీఓ ముందుకు అనవసరంగా ద్వైపాక్షిక అంశాలను పదే పదే తీసుకొచ్చే ప్రయత్నాలు దురదృష్టకరం. అవి ఎస్​సీఓ స్ఫూర్తిని ఉల్లంఘించటమే. శాంతి, భద్రత, సుసంపన్నతలను భారత్​ గట్టిగా నమ్ముతుంది. ఉగ్రవాదం, అక్రమ ఆయుధాల రవాణా, డ్రగ్స్​, మనీలాండరింగ్​లకు మేము వ్యతిరేకం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

తూర్పు లద్దాఖ్​లో చైనాతో సరిహద్దు సమస్య, చైనా చేపడుతోన్న బెల్ట్​, రోడ్​ కనెక్టివిటీ ప్రాజెక్టులు సహా సరహద్దు తీవ్రవాదాన్ని పాకిస్థాన్​ ప్రోత్సహిస్తున్న క్రమంలో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​లు సహా ఇతరు అగ్ర నేతలు హాజరైన క్రమంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్​-చైనా మధ్య సరిహద్దు సమస్య తలెత్తిన తర్వాత మోదీ, జిన్​పింగ్​లు నేరుగా ఎదురుపడటం ఇదే తొలిసారి.

ఏకపక్ష చర్యలకు వ్యతిరేకం: ఇమ్రాన్​

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ వివాదాస్పద ప్రాంతాల స్థితిని మార్చడానికి ఏ దేశమైనా తీసుకునే చట్టవిరుద్ధమైన, ఏకపక్ష చర్యలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. ఎస్​సీఓ సమావేశంలో వర్చువల్​గా పాల్గొన్న ఆయన.. ఏళ్లతరబడి కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి ఐరాస తీర్మానాలను అమలు చేయాలని, దేశాల మధ్య స్థిరత్వం, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ వ్యాక్సిన్​పై రాజకీయం చేస్తే ఊరుకోం: పుతిన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.