ETV Bharat / bharat

పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య- బలవంతపు మతమార్పిడే కారణమా? - girl suicide tamil nadu latest news

School girl suicide in tamil nadu: పాఠశాలలో బలవంతపు మతమార్పిడి కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్​లో విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

School girl suicide
పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Jan 21, 2022, 7:16 AM IST

School girl suicide in tamil nadu: తమిళనాడులోని తంజావూరు​కు చెందిన ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. పాఠశాలలో బలవంతంగా మతమార్పిడి చేశారన్న ఆవేదనతోనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఏమైందంటే..?

అరియాలూర్ జిల్లా వదుగపలయమ్ కీజా ప్రాంతానికి విద్యార్థిని.. సాక్రెడ్ హార్ట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న సెయింట్ మైఖేల్ గర్ల్ హాస్టల్లో ఉంటోంది. అయితే విద్యార్థిని జనవరి 15న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న మృతిచెందింది.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన తిరుక్కట్టుపల్లి ఎస్సై గోవిందరాజన్​.. హాస్టల్ వార్డెన్ సహయ మేరీని (62) అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా..15 రోజుల కస్టడీ విధించింది. విద్యార్థిని మృతదేహాన్ని పంచనామాకు తరలించామని, ఆ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేపడతామని గోవిందరాజన్ అన్నారు.

School girl suicide in tamil nadu
ఘటనా స్థలంలో పోలీసులు

అయితే మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మాత్రం.. హాస్టల్​లో బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఒత్తిడి తీసుకురావడం వల్లనే బాలిక మృతిచెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైనవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు కరుప్పు మురుగనాథమ్ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

School girl suicide in tamil nadu
ఘటనపై ఆందోళనకు దిగిన రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: పీజీ వైద్య సీట్ల భర్తీలో సుప్రీం కీలక తీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.