జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలను పునఃనిర్మించేందుకు (సీన్ రీకన్స్ట్రక్షన్) నిందితుడు దీప్ సిద్ధూను దిల్లీ పోలీసులు ఎర్రకోట వద్దకు తీసుకెళ్లారు. దీప్ సిద్ధూతో పాటు మరో నిందితుడు ఇక్బాల్ సింగ్‌ను కూడా తీసుకెళ్లారు. ఘటనా స్థలిలో హింస జరిగిన తీరుపై పోలీసులు ఆరా తీశారు.
కళ్లకు కట్టినట్టు..
ఆందోళనకారులు వెళ్లిన మార్గం, ఎర్రకోట వద్ద వారి కార్యకలాపాలు, లోపలికి వెళ్లిన తీరును విచారించారు. ఎర్రకోట హింసకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న దీప్ సిద్ధూను ఈ నెల 8న కర్నాల్ బైపాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సిటీ కోర్టు ఆదేశాల మేరకు ఏడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. దీప్‌సిద్ధూను ఎర్రకోటకు తీసుకెళ్లిన సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా దీప్ సిద్ధూ రైతులను రెచ్చగొట్టి హింసకు కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నాటి హింసలో దాదాపు 500 మంది పోలీసులు గాయపడ్డారు.
ఇవీ చదవండి: 'సింఘు' రైతులకు అండగా హరియాణా ప్రజలు