Agnipath Supreme Court Case: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్ అండ్ హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పెండింగ్ పిటిషన్లను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆయా పిటిషన్‌దారులు.. దిల్లీ కోర్టులోనూ వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.
పెండింగ్ కేసులు బదిలీ చేయకున్నా లేదా పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా.. దిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు చెప్పింది సుప్రీం. అగ్నిపథ్‌పై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కేసులు సహా తాము బదిలీ చేసిన పిటిషన్లను కూడా పరిశీలించాలని దిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.
Agnipath Scheme: త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ ఏడాది రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. కానీ ఈ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల యువత హింసాత్మక నిరసనలు చేపట్టింది. మరోవైపు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులు కూడా భారీగా వచ్చాయి.
ఇవీ చూడండి: అపోహల అగ్నిపథం.. తొలగిస్తే విజయపథం..
'అగ్నిపథ్'కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. చరిత్రలో తొలిసారి..