ETV Bharat / bharat

సోమవారం నుంచి సుప్రీంలో కీలక కేసుల విచారణ

క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత ఈనెల 4న సుప్రీంకోర్టులో వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పలు కీలక కేసులు విచారణకు రానున్నాయి. జనవరి 4 నుంచే నూతన రోస్టర్ విధానం అమలులోకి రానుంది.

sc-set-to-open-on-4rth-jan-after-vacations
సెలవుల తర్వాత సుప్రీం ముందుకు కీలక కేసులు
author img

By

Published : Jan 1, 2021, 5:40 PM IST

జనవరి 4 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదనలు పునఃప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత కేసుల విచారణ మొదలు కానుంది. సాగు చట్టాలు, రైతు నిరసనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లతో పాటు పలు కీలక వ్యాజ్యాలు విచారణకు రానున్నాయి.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పలువురు వ్యాజ్యం దాఖలు చేయగా.. రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దిల్లీ సరిహద్దు నుంచి రైతులను తొలగించేలా చూడాలని మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే.. కేంద్రం, రైతులు చర్చలు జరపాలని... ఇరు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అవసరమైతే సెలవుల్లోనూ సుప్రీంకు రావొచ్చని పిటిషనర్లకు సూచించింది. కానీ, మరోసారి ఈ వ్యాజ్యాలు విచారణకు రాలేదు.

ఇతర కేసులు

సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్​కు సంబంధించిన కేసును డిసెంబర్ 30న సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యం జనవరి 19న విచారణకు రానుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై వాదనలు విననుంది.

ఇదీ చదవండి: 'సైన్యంలో శాశ్వత మహిళా కమిషన్​పై పూర్తి వివరాలివ్వండి'

తాజాగా ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మత మార్పిడి వ్యతిరేక చట్టాలపైనా సుప్రీంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పౌరుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించేలా చట్టాలు ఉన్నాయని పిటిషన్లు నమోదయ్యాయి. జనవరి 6వ తేదీన ప్రధాన న్యాయమూర్తి బెంచ్​కు ఇది విచారణకు రానుంది.

నూతన రోస్టర్​ విధానం..

జనవరి 4 నుంచి అమలులోకి రానున్న కొత్త రోస్టర్ ప్రకారం... ఎన్నికలు, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే బెంచ్‌కే వస్తాయి. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసులను ప్రధాన న్యాయమూర్తితోపాటు జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనాలు విచారించనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.