ETV Bharat / bharat

'అనాథలైన పిల్లల కోసం కేంద్రం ఏం చేస్తోంది?' - సుప్రీంకోర్టు కొవిడ్​19

కొవిడ్​ వల్ల అనాథలుగా మారిన పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని అదేశించింది సుప్రీంకోర్టు. తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కూడా ఆదేశించింది.

SUPREME COURT child orphans
సుప్రీంకోర్టు కొవిడ్​ అనాథ పిల్లలు
author img

By

Published : Jun 1, 2021, 4:25 PM IST

కరోనా కారణంగా అనాథలైన పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. సంబంధించిన ప్రణాళికలు, పర్యవేక్షణపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

కరోనా వేళ అనాథలైన పిల్లల విషయమై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ నివేదిక సమర్పించారు. దేశవ్యాప్తంగా సుమారు 9 వేల మంది అనాథలుగా మారినట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినట్లు వెల్లడించారు. అనేక కుటుంబాలు ఇంటికి పెద్దదిక్కును కోల్పోయినట్లు నివేదికలో తెలిపారు. 1,411 మంది తండ్రిని.. 6,050 మంది తల్లిని కోల్పోయినట్లు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో అన్ని విషయాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్​ అనిరుద్ధ బోస్​ ధర్మాసనం. పీఎం కేర్స్‌ ఫండ్ కేటాయింపు, విధివిధానాలు పొందుపరచాలని స్పష్టం చేశారు. అనాథ పిల్లల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీంకోర్టు.. వారి బాధ్యత జిల్లా యంత్రాంగం చేపట్టాలని పేర్కొంది. వెంటనే నోడల్ అధికారులను నియమించాలని 10 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నోడల్ అధికారి జాయింట్ సెక్రటరీ స్థాయిలోనే ఉండాలని స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా.. అనాథలుగా మారిన పిల్లల వివరాలు ప్రతిరోజు అప్డేట్ చేయాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. అనాథ పిల్లల కోసం ప్రకటించిన పథకాల అమలు తీరుతెన్నులు, పర్యవేక్షణపై వివారాలు ఇవ్వాలని కేంద్రానికి స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:- Vaccine: 'టీకాల విధానంలో ఇన్ని లోపాలా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.