ETV Bharat / bharat

సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ల ఫోన్లపైనా నిఘా! - పెగసస్‌ స్పైవేర్‌ వివాదం ది వైర్‌ కథనాలు

పెగసస్ హ్యాకింగ్ వార్తల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ​ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుపడుతుండగా.. తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లపైనా గూఢచర్యం ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు 'ది వైర్' ప్రచురించిన ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ జాబితాలో మాజీ అటార్నీ జనరల్‌ సహాయకుడు సైతం ఉన్నారని ఆరోపణలొచ్చాయి.

సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ల ఫోన్లపైనా నిఘా!

author img

By

Published : Aug 5, 2021, 5:58 AM IST

పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్న పెగసస్‌ స్పైవేర్‌ వివాదంలో మరికొన్ని కొత్త విషయాలను 'ది వైర్‌' న్యూస్‌ పోర్టల్‌ బుధవారం వెల్లడించింది. మనదేశానికి చెందిన దాదాపు 300 మందిని లక్ష్యంగా ఎంచుకొని నిఘా పెట్టాల్సిన జాబితాలో వారి ఫోన్‌ నంబర్లను చేర్చారని 17 మీడియా సంస్థలతో కూడిన గ్లోబల్‌ కన్సార్షియం పేర్కొన్న విషయం తెలిసిందే. వీరిలో ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, హక్కుల సంఘాల నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులు ఉన్నారంటూ ఓ జాబితాను 'ది వైర్‌' ఇప్పటికే ప్రచురించింది. బుధవారం వెల్లడించిన తాజా వివరాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పని చేసిన ఇద్దరి ఫోన్లూ హ్యాకింగ్‌ జాబితాలో కనిపించాయని పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పాత ఫోన్‌ నంబరు, మాజీ అటార్నీ జనరల్‌ సహాయకుడి ఫోన్‌ నంబరు కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్లు తెలిపింది.

వారిపై నిఘా ఎందుకు?

సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు ఎన్‌.కె.గాంధీ, టి.ఐ.రాజ్‌పుత్‌ల ఫోన్‌ నంబర్లను 2019లోనే నిఘా పెట్టాల్సిన జాబితాలో చేర్చినట్లు 'ది వైర్‌' తెలిపింది.(ప్రస్తుతం గాంధీ పదవీ విరమణ చేశారు.) 'సర్వోన్నత న్యాయస్థానంలో కీలకమైనది రిట్‌ పిటిషన్ల విభాగం. ఏడాదికి వెయ్యికి పైగా రిట్‌ పిటిషన్లు వస్తుంటాయి. వాటిలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవీ, రాజకీయంగా సున్నితమైనవీ ఉంటాయి కనుక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రిజిస్ట్రార్లపై నిఘా పెట్టి ఉంటారు' అని వైర్‌ పేర్కొంది. "జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గత ఏడాది పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. జస్టిస్‌ మిశ్ర ఫోన్‌ నంబరు 2019లో హ్యాకింగ్‌ జాబితాలో చేరింది. 2014 నుంచే ఆ ఫోన్‌ను వినియోగించడంలేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ 2018 వరకూ జస్టిస్‌ మిశ్ర పేరు మీదనే ఆ ఫోన్‌ కొనసాగింది' అని వైర్‌ పోర్టల్‌ వెల్లడించింది.

అధికార పక్షానికి సన్నిహితుడైనా..

మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ ఛాంబరులో పనిచేసే జూనియర్‌ న్యాయవాది ఎం.తంగతురై ఫోన్‌ నంబరు కూడా స్నూపింగ్‌ జాబితాలో ఉంది. అటార్నీ జనరల్‌ పదవి నుంచి రోహత్గీ వైదొలగిన రెండేళ్ల తర్వాత 2019లో తంగతురై ఫోన్‌ నంబరు హ్యాక్‌ చేయాల్సిన జాబితాలో చేరింది. ఈ రెండేళ్ల సమయంలో రోహత్గీ అధికార పక్షానికి సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే నిఘా జాబితాలో చేర్చి ఉంటారని ‘ది వైర్‌’ అభిప్రాయపడింది.

పెగసస్‌పై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ..

'పెగసస్‌' స్పైవేర్‌ వ్యవహారంపై దాఖలైన తొమ్మిది వ్యాజ్యాలపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం దీనిని చేపట్టనుంది. ఫోన్లపై నిఘా పెట్టి గూఢచర్యానికి పాల్పడిన ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్‌ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశి కుమార్‌లు తొలుత వ్యాజ్యం వేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ మరో వ్యాజ్యంలో కోరింది. సీనియర్‌ పాత్రికేయులు మృణాల్‌ పాండే, ప్రరంజయ్‌ గుహ ఠాకుర్తా, న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ తదితరులు కూడా దావాలు వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.