ETV Bharat / bharat

'ఆ పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు నో' - వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షల రద్దు సుప్రీం వ్యాఖ్య

వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షల రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పరీక్షల రద్దుపై విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీచేయలేమని స్పష్టం చేసింది.

Supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Jun 18, 2021, 2:27 PM IST

Updated : Jun 18, 2021, 4:20 PM IST

వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షల రద్దు లేదా వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పీజీ వైద్య విద్యార్థులు.. కొవిడ్​ విధుల్లో నిమగ్నమయ్యారనే నెపంతో పరీక్షల రద్దు లేదా వాయిదాపై విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

29 మంది వైద్యులు కలిసి వేసిన వ్యాజ్యంపై జస్టిస్​ ఇందిరా బెనర్జీ, జస్టిస్​ ఎంఆర్ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. కొవిడ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను తేదీలను ప్రకటించాలని ఇప్పటికే జాతీయ వైద్య మండలికి తాము సూచించిన విషయాన్ని గుర్తుచేసింది న్యాయస్థానం. ఆ మేరకే విశ్వవిద్యాలయాలు పరీక్షల తేదీలను నిర్ణయించాలని పేర్కొంది. అయితే పరీక్షలకు సన్నద్ధమవడానికి విద్యార్థులకు తగిన సమయం ఇవ్వకుండా తేదీలను నిర్ణయించడం సరికాదని ధర్మాసం వ్యాఖ్యానించింది. అలాగే ఆ సమయాన్ని న్యాయస్థానం నిర్ణయించలేదని పేర్కొంది.

దిల్లీలో కరోనా ఉద్ధృతి ఏప్రిల్​, మే నెలల్లో ఎక్కువగా ఉండేదని.. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని పేర్కొంది. అయితే కర్ణాటకలో పరిస్థితి ఇంకా అలాగే ఉందన్న న్యాయస్థానం.. విశ్వవిద్యాలయాల వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఇన్​స్టాలో బగ్​- యువకుడికి రూ.22 లక్షల రివార్డు

Last Updated : Jun 18, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.