ETV Bharat / bharat

నీట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్.. సుప్రీం ఆదేశాలు

నీట్ ఫలితాలు వెల్లడించేందుకు (NEET result 2021) ఎన్​టీఏకు అనుమతులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇద్దరు అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు తారుమారైన నేపథ్యంలో ఫలితాలు నిలిపివేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది అభ్యర్థుల ఫలితాలను ఆపలేమని పేర్కొంది.

NEET result 2021
నీట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్
author img

By

Published : Oct 28, 2021, 11:59 AM IST

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సులలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఫలితాలను (NEET result 2021) వెలువరించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్​టీఏ) సుప్రీంకోర్టు అనుమతించింది. బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గావయ్​లతో కూడిన ధర్మాసనం (NEET SC hearing) తీర్పు చెప్పింది.

మహారాష్ట్రలోని ఓ సెంటర్​లో ఇద్దరు అభ్యర్థుల ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారు అయిన నేపథ్యంలో వీరిద్దరికీ మరోసారి పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు అక్టోబర్ 20న ఆదేశించింది. అప్పటివరకు నీట్ ఫలితాలను నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది.

ఇద్దరి కోసం ఆపలేం: సుప్రీం

దీనిపై ఎన్​టీఏ సుప్రీంను ఆశ్రయించింది. సంస్థ తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించిన వివరాలను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది అభ్యర్థుల ఫలితాలను (NEET result 2021 news) నిలిపివేయలేమని పేర్కొంది. ఆ ఇద్దరు అభ్యర్థుల విషయంపై సెలవుల (దీపావళి) తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆలోగా ఈ సమస్యపై కౌంటర్ దాఖలు చేసేందుకు నోటీసులు పంపిస్తామని తెలిపింది.

సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష (NEET 2021) నిర్వహించింది ఎన్​టీఏ. 202 నగరాల్లోని 3682 సెంటర్లలో 16,14,777 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

ఇదీ చదవండి: నీట్​ పీజీ కౌన్సిలింగ్​కు బ్రేక్​.. సుప్రీం నిర్ణయం తర్వాతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.