ప్రముఖ విద్యావేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో నిపుణులతో చట్టాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొంది.
"ఏడుగురు ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులతో సవివర చర్చలు జరిపారు. నిపుణులందరూ తమ అభిప్రాయాలు, సూచనలను కమిటీకి అందించారు."
-కమిటీ ప్రకటన
ఇప్పటివరకు కమిటీ 7 సార్లు భేటీ అయింది. ఆన్లైన్ మాధ్యమంతో పాటు నేరుగానూ వివిధ వర్గాలతో సాగు చట్టాలపై చర్చలు జరుపుతోంది.
జనవరి 12న సాగు చట్టాల అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు.. వివాద పరిష్కారానికి నలుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించింది. ప్యానెల్ నుంచి ఒకరు తప్పుకోగా.. ప్రస్తుతం ముగ్గురు సభ్యులు ఉన్నారు.
ఇదీ చదవండి: 'గాజీపుర్లో అదే జోరుతో రైతు ఉద్యమం!'