ఆధార్ రాజ్యాంగబద్ధమేనంటూ 2018లో ఇచ్చిన తీర్పుపై సమీక్షించాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈమేరకు నిర్ణయం ప్రకటించింది. అయితే ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ డీవై చంద్రచూడ్ మాత్రం ఇతర న్యాయమూర్తుల అభిప్రాయంతో విభేదించారు.
ఐటీ రిటర్నులు, పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పని సరిచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ 2018లో కేంద్రం తీర్పు వెలువరించింది. అయితే బ్యాంకు ఖాతాలు,మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు అది అవసరం లేదని తెలిపింది. సీబీఎస్ఈ, నీట్, జేఈఈ, యూజీసీ ప్రవేశ పరీక్షలు, పాఠశాలల్లో ప్రవేశాలు, ఉచిత విద్య కోసం కూడా ఆధార్ అవసరం లేదని తెలిపింది. సంక్షేమ పథకాలు,ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆధార్ అవసరమే అని 2018 తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై విచారణకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించింది.