అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. బాండ్ల విక్రయంపై స్టే విధించాలన్న వాదనలను తోసిపుచ్చింది.
ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం-ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
బంగాల్, అసోం సహా పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల బాండ్లను విక్రయిస్తే.. రాజకీయ పార్టీలకు షెల్ కంపెనీల (వాస్తవంలో లేని) ద్వారా అక్రమంగా నిధులు వచ్చే ప్రమాదం ఉందని ఏడీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఏప్రిల్ 1 నుంచి 10 వరకు బాండ్లను జారీ చేయనున్నట్లు అంతకుముందు సుప్రీం ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చూడండి: తమిళనాట మరోసారి సంస్కృత పేర్లపై వివాదం!