ETV Bharat / bharat

విద్య.. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తుందా? - సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్

వినియోగదారుల రక్షణ చట్టంలో భాగంగా 'విద్య' అనే అంశాన్ని సేవగా పరిగణించాలా? లేదా? అనే అంశంపై దాఖలైన పిటిషన్​ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ తరహా అంశంపై తీర్పు పెండింగ్‌లో ఉన్న మరో కేసుకు దీనిని జత చేస్తూ విచారణకు స్వీకరించింది.

Supreme Court
సుప్రీంకోర్టు
author img

By

Published : Nov 3, 2021, 3:55 PM IST

వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో 'విద్య' అనేది సేవా? కాదా? అనే అంశాన్ని పరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు స్వీకరించింది. విద్య అనేది వినియోగదారుల రక్షణ చట్టంలో ఒక సేవా? కాదా? అని ప్రశ్నిస్తూ 2020లో దాఖలైన 'మను సోలంకీ వర్సెస్ వినాయక మిషన్ విశ్వవిద్యాలయం' కేసుతో కలిపి దీనిని విచారించనున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ధర్మాసనం తెలిపింది.

విద్యా సంస్థలు అందించే సేవలు.. ముఖ్యంగా పాఠశాలల్లో నిర్వహించే ఈత వంటి కార్యకలాపాలు వినియోగదారుల రక్షణ చట్టం-1986 పరిధిలోకి(సేవల) రావంటూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పునిచ్చిన నేపథ్యంలో లఖ్​నవూకు చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ నేపథ్యం..

'సమ్మర్ క్యాంప్'లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. దీనిలో భాగంగా ఈత పోటీలు సైతం ఉంటాయని, రూ.1000 కట్టాలని 2007లో పిటిషనర్ కుమారుడు చదువుతున్న విద్యాసంస్థ సూచించింది.

అయితే.. మే 28న పాఠశాల కొలనులో ఈత కొడుతున్న తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని.. వెంటనే రావాల్సిందిగా పాఠశాల నుంచి ఆ వ్యక్తికి ఫోన్ వచ్చింది. వెళ్లి చూసేసరికి.. నీటిలో పడిపోయాడని.. ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే.. హాస్పిటల్​లో బాలుడు చనిపోయి ఉన్నాడు.

దీనిలో పాఠశాల నిర్లక్ష్యం ఉందంటూ ఆ వ్యక్తి రాష్ట్ర వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు. రూ.20లక్షల పరిహారంతో పాటు.. తనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.2లక్షలు, ఖర్చుల కింద మరో రూ.55వేలు ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరణకు గురైంది.

దీనిపై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్​ను ఆశ్రయించినప్పటికీ.. పాఠశాలలో నిర్వహించే ఇతర కార్యకలాపాలైన 'ఈత' వంటివి 'సర్వీస్' కిందకు రాదంటూ అతడి అభ్యర్థన తిరస్కరణకు గురైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.