కొవిడ్ బాధితుల చికిత్స నిమిత్తం తమ ఆవరణలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటుకు సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. నూతన అడ్వకేట్స్ ఛాంబర్ భవనంలో ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణను ఇటీవల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) కోరింది. దానికి సీజేఐ సుముఖత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆవరణలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించింది.
కొవిడ్ బాధితుల కోసం తాత్కాలిక కేంద్రం ఏర్పాటులో కోర్టు రిజిస్ట్రీ భాగస్వామి కాదని సుప్రీంకోర్టు పాలన విభాగం తెలిపింది. ఈ కేంద్రాన్ని ఎలా నిర్వహించాలనేది దిల్లీ ప్రభుత్వం చూసుకుంటుందని ప్రకటించింది. తాత్కాలిక కేంద్రం ఏర్పాటు, నిర్వహణపై దిల్లీ ప్రభుత్వం తగు ప్రణాళికతో వస్తే అవసరమైన ప్రదేశాన్ని కేటాయిస్తామని పేర్కొంది.
ఇదీ చదవండి : ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ