SBI Rules On Pregnancy: భారత్‌లోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు.. గర్భిణులైన తమ ఉద్యోగిణుల విషయంలో జారీ చేసిన ఆదేశాలు వివాదానికి దారి తీశాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న ఉద్యోగిణులు విధులకు అర్హులు కారని, ప్రసవం జరిగిన 4 నెలల లోపు విధుల్లో చేరాల్సి ఉంటుందని ఎస్బీఐ (S.B.I) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై దిల్లీ మహిళా కమిషన్ భగ్గుమంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఫిబ్రవరి 1లోగా సమాధానం చెప్పాలని ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది.
SBI Releases New Recruitment Rules: ఎస్బీఐ నిబంధనలు చాలా తీవ్రమైన అంశమని దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్బీఐ ఆదేశాలు వివక్షా పూరితం, చట్ట వ్యతిరేకం అని మండిపడ్డారు. కొత్త నిబంధనపై అఖిల భారత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘం సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన నిబంధనను సత్వరం ఉపసంహరించాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
విమర్శలతో వెనక్కి
గర్భిణీ మహిళల కోసం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై మహిళా కమిషన్ సహా.. ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలు ఎదురైన నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. రిక్రూట్మెంట్పై జారీ చేసిన సర్క్యూలర్‌ను ఉపసంహరించుకుంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: చిన్నవయసులోనే సరిహద్దు దాటి.. హిందువునంటూ 15 ఏళ్లుగా..