Sarpanch beaten to death: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. జాంజ్గీర్లోని భుతాహా గ్రామంలో సర్పంచ్‌పై దాడి చేసి చంపారు. గ్రామానికి చెందిన పలువురు కబ్జాదారులే సర్పంచ్‌ను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత నిందితులంతా పారిపోయారు.
Chattisgarh Sarpanch killed
స్థానిక సర్పంచ్ ద్వారకప్రసాద్ చంద్ర.. కొందరు ఆక్రమణదారులకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించారు. కబ్జా స్థలాల్లో పంటలు పండించకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే హత్యకు కారణమని తెలుస్తోంది. 10-15 మంది కర్రలతో వచ్చి సర్పంచ్‌పై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ ద్వారకప్రసాద్ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.
Janjgir Sarpanch death protest
హత్యకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్ మల్కారోడా సహా 112 సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సర్పంచ్ మరణించారని ఆరోపిస్తున్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిందితులను అరెస్టు చేసేంతవరకు కదిలేది లేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'నేరస్థుడి మానసిక స్థితినీ చూసి శిక్ష విధించాలి'