Hyderabad Apsara Murder Case Updates : సరూర్‌నగర్‌కు చెందిన యువతి అప్సర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 3న ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా బయటపడింది. యువతి అప్సర ఏడాది క్రితం సినిమాలు, సీరియళ్లలో నటించేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు తల్లితో పాటు వచ్చింది. వీరు సరూర్‌నగర్‌లో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న వెంకట సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. అప్సర ఆలయానికి తరచూ వెళ్లి వస్తుండటంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే సాయి కృష్టకు వివాహం అయి ఓ కుమార్తె కూడా ఉంది. అతను తరచూ యువతి ఇంటికి రాకపోకలు సాగించే వాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అయితే తనను పెళ్లి చేసుకోమని అప్సర, సాయి కృష్ణను ఒత్తిడి చేసేది. ఈ క్రమంలో ఆమెను ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలని అతను భావించాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను కోయంబత్తూరు తీసుకువెళ్తున్నానని అప్సర తల్లికి చెప్పాడు. ఈ నెల 3వ తేదీన తన కారులో ఆమెను వెంట తీసుకుని శంషాబాద్‌కు వెళ్లాడు. పలు ప్రాంతాల్లో తిప్పిన తర్వాత భోజనం చేసి సుల్తాన్‌పల్లికి చేరుకున్నారు.
Saroornagar Apsara Murder News : అప్సర కారు ముందు సీటులో నిద్రలో ఉండగా అతను కారుకు కప్పే కవర్‌తో చుట్టి ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడు. వెంట తెచ్చుకున్న బెల్లం దంచే రాయితో తలపై మోదాడు. దీంతో ఆమె మరణించగా మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకుని.. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. కారు డిక్కీలో మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఉంచిన తర్వాత విషయం బయటపడుతుందని భావించి సరూర్‌నగర్ మండల కార్యాలయం సమీపంలో మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించి రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు. ఏమీ ఎరగనట్టు ఏకంగా అప్సర తల్లితో కలిసి శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అప్సర భద్రాచలం వెళ్తుందంటే శంషాబాద్ దగ్గర వదిలిపెట్టామని ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉందని ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నిందితుడు తిరిగి ఆలయానికి చేరుకుని తన రోజు వారి విధుల్లో మునిగిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిందితుడి సెల్ ఫోన్, సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో హత్య విషయం బయటపడింది. నిందితుడు సాయికృష్ణను తదుపరి పోలీసు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: