ETV Bharat / bharat

పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీ.. బంగారం దొరికినా.. - తమిళనాడు చెన్నై వార్తలు

ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చెత్త సేకరిస్తుండగా తనకు లభించిన 100 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించింది. మేరీ నిజాయితీని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

sanitation worker finds gold
చెత్తసేకరిస్తుండగా బయటపడిన బంగారం.. కానీ..
author img

By

Published : Oct 22, 2021, 11:37 AM IST

Updated : Oct 22, 2021, 1:19 PM IST

తనకు దొరికిన 100 గ్రాముల బంగారాన్ని సంబంధిత వ్యక్తులకు అప్పగించి తన నిజాయతీని నిరూపించుకుంది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.

ఇదీ జరిగింది..

అన్నమలయ్​ నగర్​కు చెందిన గణేశ్​ రామనన్​ ఇటీవల 100 గ్రాముల బంగారపు నాణాన్ని కొనుగోలు చేశాడు. ఆ నాణాన్ని అతని నివాసంలో మంచం కింద ఓ కవర్లో పెట్టి దాచాడు. ఈ విషయం తెలియని అతని భార్య ఆ కవర్​ను చెత్త బుట్టలో పారవేసింది.

సోమవారం నాడు చెత్తను సేకరిస్తున్న క్రమంలో మేరీకి బంగారపు నాణెం ఉన్న పాలిథిన్​ కవర్​ లభించింది. తొలుత ఆ కవర్​లో ఏదో ఇనుప వస్తువు ఉందని భావించిన మేరీ.. దానిని తెరిచి చూడగా అందులో బంగారు నాణెం ఉంది. వెంటనే ఆ నాణాన్ని స్థానిక పోలీసులకు అప్పగించింది.

బంగారం కనిపించకపోవడంపై అప్పటికే ఠాణాలో రామనన్​ ఫిర్యాదు చేయడం వల్ల.. పోలీసులు వివరాలు తెలుసుకుని ఆ బంగారాన్ని అతనికి అప్పగించారు. ఈ సందర్భంగా మేరీ నిజాయతీని అందరూ ప్రశంసించారు.

ఇదీ చూడండి : పరారీలోని నిందితునికి బెయిల్‌ వద్దు: సుప్రీం

Last Updated : Oct 22, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.