ఉత్కల్ దివస్(ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం)ను పురస్కరించుకుని 12 మంది గొప్ప వ్యక్తుల చిత్రాలను రూపొందించి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు ఆ రాష్ట్రానికి చెందిన సైకత శిల్పి, కళాకారుడు సత్యనారాయణ్ మహారాణా.
ఒరియా హీరోస్ పేరుతో.. ఒడిశా మ్యాప్‌ను చెక్కపై చెక్కి వాటిపై.. చిన్న నమూనాలతో అద్భుతంగా రూపొందించారు. తాను ప్రతి ఏటా ఉత్కల్ దివస్ సందర్భంగా.. వైవిధ్యభరితంగా చిత్రాలను రూపొందిస్తున్నట్లు 'ఈటీవీ భారత్'కు వివరించారు. ముక్కలుగా ఉన్న ఉత్కల్ ప్రదేశ్‌ను కలిపిన గొప్ప వ్యక్తులను తాను ఇలా సత్కరిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
చెక్కపై ఉత్కలమణి గోప్బంధు దాస్, బాజీ రౌత్, వీర్ సురేంద్ర సాయ్, కృష్ణ చంద్రగజపతి.. తదితరుల చిత్రాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: భరతమాత సేవకై.. తుపాకీ పట్టిన నారీమణులు