ETV Bharat / bharat

రష్యాపై కఠిన ఆంక్షలు.. భారత రక్షణ రంగంపై ప్రభావమెంత?

author img

By

Published : Mar 9, 2022, 6:57 PM IST

Russia Sanctions effect on India: రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడం భారత సైన్యంపై ప్రభావం చూపదా? దేశ రక్షణ రంగ ఉత్పత్తుల దిగుమతులకు ఎలాంటి ఇబ్బంది లేదా? అంటే.. అవుననే చెబుతున్నారు నిపుణులు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో రష్యా స్వయం సమృద్ధిగా ఉండటం, భారత్‌ క్రమంగా దిగుమతులు తగ్గించుకోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.

sanctions-on-russia-effect-on-india
sanctions-on-russia-effect-on-india

India Russia Defence sector: రష్యాపై అమెరికా సహా నాటో దేశాలు విధించిన కఠిన ఆంక్షల ప్రభావం భారత రక్షణ రంగంపై పెద్దగా ఉండదని నీతి ఆయోగ్‌ సభ్యుడు, డీఆర్​డీఓ మాజీ ఛీప్‌ వీకే సారస్వత్‌ వెల్లడించారు. రష్యాకు స్వాభావికమైన సైనిక బలం ఉందని, రక్షణ ఉత్పత్తుల్లో ఆ దేశం స్వయం సమృద్ధి సాధించిందని అన్నారు. వారి వద్ద రిజర్వ్‌లు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు. ప్రస్తుతం భారత్‌ 68 శాతం రక్షణ సామగ్రిని దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. 2022-23 బడ్జెట్‌లో ఆ దిశగా అడుగులు పడ్డాయని, సైనిక బలగాల కోసం రక్షణ సామగ్రి దేశీయంగానే తయారవుతుందని తెలిపారు. మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ రక్షణ రంగానికి కూడా వర్తిస్తోందన్నారు.

Sanctions on Russia will effect India?

గత ఏడాది మార్చిలో విడుదలైన సిప్రీ నివేదిక ప్రకారం 2011-15తో పోలిస్తే 2016-20లో భారత రక్షణ రంగ దిగుమతులు 33 శాతం తగ్గాయి. రష్యాపై ఎక్కువగా ఆధారపడటాన్ని భారత్‌ క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. గత కొన్నేళ్లుగా దేశీయంగా రక్షణ పరిశ్రమ అభివృద్ధికి భారత్ అనేక చర్యలు చేపట్టింది. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం ఆయుధాలు, సైనిక సామగ్రి విషయంలో భారత్‌... రష్యాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకుంది. అయితే రష్యా సరఫరా చేసిన రక్షణ సామగ్రి వాడకుండా భారత సైన్యం పూర్తి సామర్థ్యంతో పని చేయలేదు. ఇంకా కొంతకాలం వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

India Defence imports Russia

ప్రస్తుతం భారత సైన్యం వద్ద రష్యా తయారు చేసినవి, రష్యా రూపకల్పన చేసిన సామగ్రి ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా భారత సైన్యం యుద్ధ ట్యాంకుల్లో ఎక్కువగా రష్యా తయారు చేసినవే. మొత్తం యుద్ధ ట్యాంకుల్లో రష్యాకు చెందిన టీ-72ఎమ్‌1.... 66 శాతం, టీ-90ఎస్‌.... 30 శాతం ఉన్నాయి. ప్రస్తుతం భారత నౌకాదళం వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక కూడా రష్యాకు చెందినదే. ఇక యుద్ధ విమానాలదీ అదే పరిస్థితి. అయితే రక్షణ ఉత్పత్తుల తయారీకి మరే దేశంపైనా ఆధారపడే అవసరం రష్యాకు లేకపోవడం భారత్‌కు కలిసివచ్చే అంశం. భారత్‌కు రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులపై ఉక్రెయిన్‌ యుద్ధం లేదా ఆంక్షల ప్రభావం ఉండబోదని ఇప్పటికే రష్యా ప్రకటించడం మనకు ఊరటనిచ్చే అంశం.

ఇదీ చదవండి: న్యూక్లియర్ ప్లాంట్​కు కరెంట్ కట్.. ఉక్రెయిన్​లో డేంజర్​ బెల్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.