ETV Bharat / bharat

ఔరా.. కేక్​తో ఆరడుగుల 'బాలు' విగ్రహం - సేలం

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వినూత్నంగా నివాళులర్పించాడు తమిళనాడు సేలంకు చెందిన ఓ వ్యక్తి. కేక్​తో... ఏకంగా ఆరడుగుల బాలు విగ్రహం చేయించాడు. ప్రస్తుతం ఈ ప్రతిరూపాన్ని తన బేకరీలో ప్రదర్శనకు ఉంచాడు.

Salem district cake shop owner pays tribute to SPB in different manner as he made 6 feet cake statue
కేక్​తో ఆరడుగుల 'బాలు' విగ్రహం
author img

By

Published : Dec 24, 2020, 10:06 AM IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తమిళనాడు సేలం పట్టణంలోని ఓ బేకరి వ్యక్తి వినూత్నంగా నివాళి అర్పించాడు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని ఆరు అడుగుల ఎత్తయిన బాలు విగ్రహాన్ని కేక్​తో తయారు చేయించాడు.

కేక్​తో ఆరడుగుల 'బాలు' విగ్రహం

ఈ కేక్​ తయారీ కోసం 100 కేజీల పంచదార, 80 గుడ్లు వాడినట్లు బేకరి ఓనర్​ సతీష్​ పేర్కొన్నాడు. ఆరుగురు కలిసి మూడు రోజుల పాటు ఈ కేక్​ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపాడు. గతంలోనూ.... ఈ బేకరిలో నటుడు రజనీకాంత్, పలువురు ప్రముఖ క్రికెటర్ల ప్రతిరూపాలను కేక్​తో తయారు చేసినట్లు వెల్లడించాడు. బాలు విగ్రహాన్ని కొన్ని రోజుల పాటు బేకరిలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.