కేరళలోని శబరిమల (sabarimala news) ఆలయం నేడు తెరుచుకోనుంది(sabarimala temple opening). 2 నెలలపాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. రోజుకు 30 వేల మందిని వర్చువల్ క్యూ విధానంలో ఆలయంలోకి అనుమతించనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత.. అదేనెల 20న ఆలయాన్ని మళ్లీ మూసివేయనున్నారు.
శబరిమలకు వచ్చే భక్తులు రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. లేని పక్షంలో దర్శనానికి 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేశాయి. కొవిడ్ దృష్ట్యా అధికారులు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టారు. వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతి ఉంటుందని.. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాలి నడకన వచ్చే వారు స్వామి అయ్యప్పన్ రోడ్డును మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: తాత్కాలికంగా నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్లు!