ETV Bharat / bharat

భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే - అయ్యప్ప శబరిమల

ఎన్నో ఏళ్లుగా కోట్లాదిమంది భక్తులు ఎదురుచూస్తోన్న శబరిమల రైలు మార్గానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్ట్​కు అయ్యే ఖర్చులో 50 శాతం భరించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. ఇక అయ్యప్ప భక్తులు నేరుగా శబరిమలకు రైలులో వెళ్లేందుకు అవకాశం దొరికింది.

Kerala
భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే
author img

By

Published : Jan 7, 2021, 4:49 PM IST

Updated : Jan 7, 2021, 5:37 PM IST

కేరళలోని శబరిమల అయప్ప స్వామి క్షేత్రానికి చేరుకోవాలంటే ఏ రైలు ఎక్కాలి? ఇలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే శబరిమలకు నేరుగా రైలు మార్గం లేదు. ఇప్పుడు ఆ కల సాకారం కానుంది. ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తోన్న శబరిమల రైల్వే ప్రాజెక్ట్​కు మార్గం సుగమమైంది. సదరు ప్రాజెక్ట్​కు అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు కేరళ రాష్ట్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.

ప్రతిపాదిత 111 కి.మీ అంగమాలి- శబరిమల ప్రాజెక్ట్​ త్వరలోనే పూర్తికానుంది. ఇందుకు సంబంధించిన నిధులను కేరళ మౌలిక వసతులు, పెట్టుబడి నిధుల బోర్డ్​ నుంచి కేటాయించనున్నట్లు కేబినెట్​ తెలిపింది.

ప్రాజెక్ట్​ వివరాలు

  • ప్రాజెక్ట్​ అంచనా వ్యయం: రూ.2,815.62 కోట్లు
  • రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు: 50 శాతం
  • రైల్వే లైను: అంగమాలి- శబరి వయా ఎరుమేలి

ఎప్పుడో కావాల్సింది...

ఈ ప్రాజెక్ట్​ను 1997-98 రైల్వే బడ్జెట్​లో ప్రతిపాదించారు. రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్ట్​ భూమికి రూ.50.76 కోట్లు సహా మొత్తం రూ.517.70 కోట్లు 2006 మే లో కేటాయించింది ప్రభుత్వం.

వెంటనే అంగమాలి- కలాది (7 కిమీ), కలాది-పెరుంబవూర్​(10 కిమీ) పనులు మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్​ నిలిచిపోయింది. ప్రాజెక్ట్​ కోసం చేపట్టిన భూసేకరణపై స్థానికులు నిరసనలు చేపట్టారు. కోర్టులో కేసులు నమోదయ్యాయి.

భారీగా పెరిగింది...

ఈ కారణాలతో ప్రాజెక్ట్​ బడ్జెట్​ భారీగా పెరిగింది. 1997లో అంచనా వ్యయం రూ.550 కోట్లు. 2017 వచ్చేసరికి అది రూ.1566 కోట్లు అయింది. ప్రస్తుతం ఈ అంచనా రూ.2,815 కోట్లుగా ఉంది.

50-50 ప్రతిపాదన...

ఈ ప్రాజెక్ట్​ బడ్జెట్​ అంచనా భారీగా పెరగడం వల్ల రైల్వే నిధులు ఒక్కదాని నుంచే కేటాయించడం అసాధ్యమని రైల్వేశాఖ తెలిపింది. ఇందుకోసం ప్రాజెక్ట్​ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాలని 2011, 2012లో కేరళ సర్కారుకు లేఖ రాసింది.

2015లో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఏడాదిలోపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2017లో మరోసారి రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. ఎలాంటి నిర్ణయం చెప్పకపోవటం వల్ల ప్రాజెక్ట్​ను ఎటూ తేల్చని స్థితిలో రైల్వేశాఖ విడిచిపెట్టింది.

ఎట్టకేలకు ఇందులో 50 శాతం ఖర్చు భరించేందుకు కేరళ సర్కారు ఒప్పుకుంది.

Last Updated : Jan 7, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.