S-400 missile system: రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఎస్-400 తొలి రెజిమెంట్‌ను.. పంజాబ్‌లోని వైమానిక స్థావరంలో ఏర్పాటు చేయనున్నట్లు భారత సైన్యం ప్రకటించింది. ఫిబ్రవరిలోగా.. ఈ అధునాతన క్షిపణి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పింది. ఎస్-400 క్షిపణి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది.
క్షిపణికి సంబంధించిన అతి ముఖ్యమైన విడి భాగాలు, ఇతర పరికరాలను తరలిస్తున్నట్లు సైన్యాధికారులు పేర్కొన్నారు. క్షిపణి ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే ఉత్తర సెక్టార్‌లోని చైనా సరిహద్దు ప్రాంతం, అలాగే పాకిస్థాన్ సరిహద్దు క్షిపణి పరిధిలోకి వస్తాయని వివరించారు.
S-400 delivery to india
మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేందుకు 2018, అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్షిపణుల కొనుగోలు కోసం.. 500 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తోంది భారత్. ఇప్పటికే.. 2020లో 800 మిలియన్ డాలర్లను రష్యాకు చెల్లించింది. అయితే దీనిపై తొలి నుంచి అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది.
ఎస్-400.. రష్యా రూపొందించిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ. దీర్ఘశ్రేణిలో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ట్రయాంఫ్ ఇంటర్‌సెప్టర్ ఆధారిత క్షిపణి వ్యవస్థ.. 400 కిలోమీటర్ల దూరంలోని శుత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.
ఇవీ చూడండి:
S 400 Missile System: గగనతల రక్షణలో కొత్త అధ్యాయం
పంజాబ్‌లో ఎస్-400 మోహరింపు.. ఏక కాలంలో ఇద్దరు శత్రువులపై గురి..!