ఎస్-400 క్షిపణులను భారత్‌కు తాము విక్రయించేందుకు 2018లో కుదిరిన ఒప్పందం నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి కావడం సహా దీనికి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని రష్యా తెలిపింది. రష్యా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఈ ఒప్పందం కొనసాగింపుపై ఆ దేశం స్పష్టతనిచ్చింది.
చట్ట విరుద్ధ, అన్యాయమైన పోటీని పెంచేలా విధించే ద్వైపాక్షిక ఆంక్షలను.. రెండు దేశాలు గుర్తించబోవని భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుదషేవ్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది మార్చిలో భారత్‌లో పర్యటించిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. ఎస్-400 ఒప్పందం గురించి నేరుగా ప్రస్తావించకుండా రష్యాతో రక్షణ ఒప్పందాలపై వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున తమ మిత్రదేశాలు రష్యాతో రక్షణ పరికరాల కొనుగోలు ఒప్పందాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: 'కూచ్‌బిహార్ నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం'