ETV Bharat / bharat

ఖాతా తెరిచిన ఎంఐఎం.. భాజపాకు పది ఓట్లు - తమిళనాడు ఎన్నికల ఫలితాలు

TN Local Body election results: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే సత్తాచాటింది. ఎన్నికలు జరిగిన 21 కార్పొరేషన్‌లలో అన్నింటిలోనూ డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉంది. మరోవైపు 138 మున్సిపాలిటీలకు గానూ 134 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులు ఆధిపత్యం చూపారు.

Ruling DMK secures thumping victory in Urban Civic polls
ఖాతా తెరిచిన ఎంఐఎం.. భాజపాకు పది ఓట్లు
author img

By

Published : Feb 22, 2022, 8:50 PM IST

TN Local Body election results: తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సత్తాచాటింది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఎన్నికలు జరిగిన 21 కార్పొరేషన్‌లలో అన్నింటినీ డీఎంకే కూటమి కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు 138 మున్సిపాలిటీలకుగానూ 134 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఒక్క మునిసిపాలిటీలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

పట్టణ పంచాయతీల్లో కూడా డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోంది. 489 స్థానాలకు గానూ 435 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ ఫలితాల్లో ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపు దిశగా సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 1,373 కార్పొరేషన్ వార్డుల్లో డీఎంకే కూటమి 1,050 వార్డుల్లో, అన్నాడీఎంకే కూటమి 153 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

మరోవైపు మున్సిపల్‌ వార్డుల్లో కూడా డీఎంకే జోరు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,842 మున్సిపల్​ వార్డులు ఉండగా.. అధికార పార్టీ కూటమి 2,638 వార్డుల్లో, అన్నాడీఎంకే కూటమి 641 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పట్టణ పంచాయతీల్లో కూడా అధికార పక్షం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తుంది. మొత్తంగా 7,604 పట్టణ పంచాయతీలు ఉండగా 4,960 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే కూటమి 1,214కు పరిమితం అయ్యేలా ఉంది. జాతీయ పార్టీ అయిన భాజపా ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. అయితే 21 కార్పొరేషన్‌ వార్డుల్లో, 58 మున్సిపల్‌ వార్డుల్లో 233 పట్టణ పంచాయతీ వార్డుల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కంచుకోట బద్దలు..

ఇక ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది డీఎంకే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కోయంబత్తూరు ప్రాంతంలో ఏళ్లుగా గట్టి పట్టు కలిగిన అన్నాడీఎంకే పార్టీ 10 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ స్థానాల్లో 75 శాతానికి పైగా డీఎంకే విజయం సాధించింది. కార్పొరేషన్లలోని 1,374 వార్డుల్లో డీఎంకే 425 స్థానాల్లో జయభేరి మోగించింది. అన్నాడీఎంకే 75 స్థానాల్లో గెలిచింది.

ప్రచారంలో వివాదం.. ఎన్నికల్లో విజయం..

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గాడ్సే వివాదానికి తెరతీసి ఉమా ఆనందన్​ గెలుపొందారు. గ్రేటర్​ చెన్నై నగరపాలక సంస్థలోని 134వ వార్డు నుంచి ఎన్నికయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే అభ్యర్థులు బరిలో నిలిచినా.. 5,539 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో ఉమా ఆనందన్.. గాడ్సే గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి.

ఖాతా తెరిచిన ఎంఐఎం..

తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. వాణియంబాడీ మున్సిపాలిటీలోని 19వ వార్డు నుంచి బరిలోకి దిగిన నబీలా అహ్మద్​ అనే న్యాయవాది విజయం సాధించారు.

భాజపా అభ్యర్థికి 10 ఓట్లు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో మేలూరు మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 10 ఓట్లు మాత్రమే పోల్​ అయ్యాయి. ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటు వేసేందుకు వచ్చే మహిళలు హిజాబ్​ తీసేసి రావాలని పట్టుపట్టాడు. అయితే ఈ వార్డులో యాసిన్​ అనే డీఎంకే అభ్యర్థి గెలవడం విశేషం.

ట్రాన్స్​జెండర్​ గెలుపు..

వెల్లూరు కార్పొరేషన్​ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ ట్రాన్స్​జెండర్​ విజయం సాధించారు. 37 వార్డు నుంచి డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన గంగా నాయక్​ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Ganganayak
సత్తా చాటిన గంగా నాయక్​

భార్యాభర్తల విజయం..

మణప్పారైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన భార్యాభర్తలు గెలుపొందారు. సీఐఐ నుంచి పోటీ చేసిన తంగమణి, మనోన్మణీ అనే ఈ ఇద్దరు 19,20 వార్డుల నుంచి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

Ruling DMK secures thumping victory in Urban Civic polls
గెలుపొందిన భార్యాభర్తలు

సీపీఐ నుంచి గెలిచిన భార్యాభర్తలు

ఇదీ చూడండి: 'స్థానిక' పోరులో డీఎంకే జోరు.. కార్యకర్తల సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.