sabarimala news today: శబరిమల తీర్థయాత్రకు వచ్చే చిన్నారులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం తెలిపింది. శానిటైజర్లు, సబ్బులు పిల్లలకు ప్రత్యేకంగా ఉండేలా వారి వెంట వచ్చే పెద్దలు చూసుకోవాలని తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించాలని పేర్కొంది.
తీర్థయాత్రలో పాల్గొనే భక్తులు, సిబ్బందికి టీకా రెండు డోసులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. లేదా ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. నవంబర్ 16 నుంచి ప్రారంభమైన శబరి యాత్రలో (Sabarimala News) భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. వర్షాలు, కరోనా నేపథ్యంలో ఇంతకు ముందులానే వర్చువల్ క్యూ పద్దతిలో భక్తులను అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి: దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై మోదీ సమీక్ష