ETV Bharat / bharat

డ్రగ్స్​ స్మగ్లింగ్​పై కేంద్రం ఉక్కుపాదం.. 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం - డ్రగ్స్ ధ్వంసం

Drugs Destroyed : దేశంలో ఇటీవల పట్టుబడిన లక్షా నలభై నాలుగు వేల కిలోల మాదకద్రవ్యాలను నార్కొటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని దిల్లీలో వీక్షించారు.

ncb destroyed drugs
ncb destroyed drugs
author img

By

Published : Jul 17, 2023, 2:00 PM IST

Updated : Jul 17, 2023, 2:38 PM IST

Drugs Destroyed NCB : దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) స్వాధీనం చేసుకున్న లక్షా నలభై నాలుగు వేల కిలో డ్రగ్స్​ను కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమక్షంలో అధికారులు ధ్వంసం చేశారు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్లో రూ.2,378 కోట్లు ఉంటుందని తెలిపారు. 'మాదకద్రవ్యాల అక్రమ రవాణా - జాతీయ భద్రత' అనే అంశంపై దిల్లీలో జరిగిన సదస్సుకు అమిత్ షా సోమవారం హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాదకద్రవ్యాల ధ్వంసాన్ని ఆయన వీక్షించారు.

  • Union Home Minister Amit Shah is chairing Regional Conference on ‘Drugs Trafficking and National Security’ in New Delhi. In the presence of the Home Minister, over 1,44,000 kilograms of drugs will be destroyed shortly in various parts of the country by NCB, in coordination with… pic.twitter.com/IXNtGzzph2

    — ANI (@ANI) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'డ్రగ్స్​పై యువతకు సమగ్ర అవగాహన అవసరం'
డ్రగ్స్​పై యువతకు సమగ్ర అవగాహన కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. డ్రగ్స్ అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టెనెంట్​ గవర్నర్​లను కోరారు. 'ఈ రోజు మొత్తం 1,44,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం చేశాం. ఈ మాదకద్రవ్యాల విలువ రూ. 2,378 కోట్లు. ఇంతటి ప్రక్రియలో భాగమైన ఎన్​సీబీకి ధన్యవాదాలు. 2006-13 మధ్య మొత్తం 1,250 కేసులు నమోదైతే.. 2014-23 మధ్య 3,700 కేసులు నమోదయ్యాయి. గతంలో కంటే భారీగా డ్రగ్స్​ను పట్టుకున్నాం' అని కేంద్రహోం మంత్రి అమిత్ షా అన్నారు.

  • Deputy | " I request all Chief Ministers and Lieutenant Governors to implement this step in all states...the biggest step to win this fight is to create maximum awareness. Till we don't spread awareness among youths against drugs, we won't be able to win this fight...": Union… https://t.co/pe3hadsy7C pic.twitter.com/9AYJPhGJfK

  • A total of more than 1,44,000 kg of drugs have been destroyed today. For this I thank all the states and NCB as we have been able to destroy drugs worth Rs 2,378 crore through this campaign: Union Home Minister Amit Shah pic.twitter.com/BQf9Toxoig

NCB Drug News : ధ్వంసం చేసిన మాదకద్రవ్యాలు అధికంగా మధ్యప్రదేశ్ నుంచే ఉన్నాయి. హైదరాబాద్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో పరిధిలో 6,590 కిలోల డ్రగ్స్, ఇందోర్​ పరిధిలో స్వాధీనం చేసుకున్న 822 కిలోలు, జమ్ము పరిధిలో 356 కిలోల డ్రగ్స్​ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 1,03,884 కిలోలు, అసోంలో 1,486, చండీగఢ్‌లో 229, గోవాలో 25, గుజరాత్‌లో 4,277, హరియాణాలో 2,458, జమ్ముకశ్మీర్‌లో 4,069, మహారాష్ట్రలో 159, త్రిపురలో 1,803, ఉత్తరప్రదేశ్‌లో 4,049 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు ధ్వంసం చేశారు.

  • In 2006-13, total 1,250 cases were registered and till 2014-23, 3,700 cases have been registered...Earlier 1.52 lakh kg of drugs were seized and today it is 3.94 lakh kg which shows an increase of 160%: Union Home Minister Amit Shah pic.twitter.com/MrxusShr2a

సోమవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో డ్రగ్స్​ను ధ్వంసం చేయడం వల్ల ఇప్పటివరరు ఈ ఏడాది 10 లక్షల కిలోల డ్రగ్స్​ను ధ్వంసం చేసినట్లైంది. 2022 జూన్ 1 నుంచి 2023 జులై 15 వరకు.. NCB ప్రాంతీయ యూనిట్లు, రాష్ట్రాల యాంటి నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్‌లు సమష్టిగా సుమారు 8 లక్షల 76 వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశాయి. ధ్వంసం చేసిన మాదకద్రవ్యాల విలువు దాదాపు రూ. 9,580 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Last Updated : Jul 17, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.