ETV Bharat / bharat

దీపావళి బోనస్​గా రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్స్- ఉద్యోగులకు యజమాని సర్​ప్రైజ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 1:33 PM IST

Updated : Nov 5, 2023, 2:26 PM IST

Royal Enfield bikes As Diwali Bonus : తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి బోనస్​గా రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​లను ఇచ్చారు తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి. డ్రైవర్​ నుంచి మేనేజర్​ వరకు అన్ని స్థాయిల వారికీ కానుకలు ఇచ్చి సర్​ప్రైజ్​ చేశారు. అనూహ్యంగా తమ యజమాని ఖరీదైన కానుకలు ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు.

Royal Enfield bikes As Diwali Bonus
Royal Enfield bikes As Diwali Bonus

దీపావళి బోనస్​గా ఉద్యోగులకు రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్స్ ఇచ్చిన యజమాని

Royal Enfield bikes As Diwali Bonus : తన సంస్థలో పనిచేస్తున్న 15 మంది ఉద్యోగులకు దీపావళి బోనస్​గా రాయల్ ఎన్​ఫీల్డ్​ బైక్​లను ఇచ్చారు ఓ యజమాని. తన కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్​ నుంచి మేనేజర్​ వరకు తేడా లేకుండా అందరికీ బైక్​లను బోనస్​గా ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పుర్​లో జరిగింది.

శివకుమార్​ అనే వ్యాపారవేత్త కోటగిరి ప్రాంతంలో దాదాపు 20 ఏళ్లుగా నివసిస్తున్నారు. ఇక్కడే ఓ ఎస్టేట్​ కొని.. అందులో క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్​రూట్​, స్ట్రాబెర్రీ తదితర కూరగాయలు పండ్ల సాగు చేస్తున్నారు. అయితే అతడి కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా సర్​ప్రైజ్​ కానుకలు ఇవ్వడం అలవాటు. అందులో భాగంగా ఈసారి డ్రైవర్​ నుంచి మేనేజర్​ స్థాయి వరకు తన ఉద్యోగుల్లో 15 మందిని ఎంపిక చేశారు. వారికి నచ్చిన ద్విచక్ర వాహనాలు ఏంటో తెలుసుకుని.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్, రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350, యమహా రే స్కూటర్ మోడల్స్​లో 15 బైక్​లను బుక్​ చేశారు. అనంతరం వాటిని ఉద్యోగులకు ఇచ్చి సర్​ప్రైజ్​ చేశారు.

Royal Enfield bikes As Diwali Bonus
ఉద్యోగులకు బైక్​ తాళాలు అందిస్తున్న శివకుమార్
Royal Enfield bikes As Diwali Bonus
శివకుమార్​ ఎస్టేట్​

ఈ సర్​ప్రైజ్​ను ఊహించని ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయమై శివకుమార్​ను వివరణ కోరగా.. 'మన కోసం కష్టపడి పనిచేసే ఉద్యోగులను సంతోషంగా ఉంచాలని భావించినప్పుడు.. వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. అందులో భాగంగా సంస్థ తరఫున వారికి వసతి, వారి పిల్లలకు వైద్యం, విద్య వంటివి అందిస్తున్నాం. అలాగే మా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఇతర వ్యాపారవేత్తలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఉద్యోగులే. కాబట్టి వ్యాపారస్థులు తమ ఉద్యోగులను సంతోషంగా ఉంచాలి. వారి అవసరాలను తీర్చాలి. దాని ద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. దాంతో పాటు మీ ఉద్యోగుల జీవితాలు కూడా మెరుగుపడతాయి. అప్పుడు సమాజం కూడా పురోగమిస్తుంది' అని వివరించారు.

Royal Enfield bikes As Diwali Bonus
బైక్ నడుపుతున్న వ్యాపారి శివకుమార్
Royal Enfield bikes As Diwali Bonus
రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​లపై వెళ్తున్న ఉద్యోగులు

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి రూ.2.11 కోట్ల విలువైన కానుకలు

Last Updated : Nov 5, 2023, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.