ETV Bharat / bharat

దేశ చరిత్ర గతినే మార్చిన అజ్మీర్​ కోట

భరత మాత బ్రిటిష్ వాళ్ల దాస్య శృంఖలాలలో బందీ అయ్యే అధ్యాయానికి ఆ కోట ప్రత్యక్ష సాక్షి. ఈస్టిండియా కంపెనీ రాకకు వీలుకల్పించే ఒప్పందంపై మొఘల్ చక్రవర్తి జహంగీర్ సంతకం చేసింది అక్కడి నుంచే. మరో మొఘల్ చక్రవర్తి అక్బర్ రణతంత్రాలకు అదే కోట నెలవైంది. ఆ దుర్గం చరిత్రాత్మక అజ్మీర్ కోట. అజ్మీర్​ మ్యూజియం అనేక చారిత్రక ఘటనలకు సాక్ష్యాలను మనముందుంచుతోంది.

ajmer fort
అజ్మీర్​ కోట
author img

By

Published : Aug 28, 2021, 6:23 AM IST

అజ్మీర్​ కోట

చరిత్రాత్మకమైన అజ్మీర్ నగరం నడిబొడ్డున స్టేట్ మ్యూజియం ఉంది. అక్బర్ కాలంలో దీన్ని నిర్మించారు. బ్రిటిషర్ల బానిస పరిపాలనకు మొదటి అధ్యాయం అజ్మీర్ కోట నుంచే ప్రారంభమైంది. 1616 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ -1 ఆదేశాలతో , థామస్ రో ఇదే కోటలో మొఘల్ చక్రవర్తి జహంగీరును కలిశారు. మనదేశంలో వాణిజ్య ఒప్పందానికి అనుమతి సాధనే ఈ సమావేశ ముఖ్యోద్దేశం.

ఈస్టిండియా కంపెనీ భారత్‌లో తన వ్యాపారం ప్రారంభించడానికి వచ్చింది. ఇంగ్లండ్‌ రాజ దూతగా థామస్‌ రో అజ్మీర్‌ రాజాను కలిశారు. ఈస్టిండియా కంపెనీ తన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో, ఏ పద్దతిలో ముందుకెళ్లాలో నిర్ణయించే బాధ్యత, ముస్లీం రాజుల నుంచి అనుమతులు తీసుకునే బాధ్యత ఆయనపై ఉంచింది.

-నీర‌జ్‌ త్రిపాఠి, సర్కిల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ మ్యూజియం, అజ్మీర్

గుజరాత్ లో కీలకమైన సూరత్‌ సహా దేశంలోని అనేక ముఖ్యకేంద్రాలలో ఫ్యాక్టరీల స్థాపనకు ఈస్టిండియా కంపెనీ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ను అనుమతి కోరింది. కంపెనీ ప్రతినిధులతో అనేక సమావేశాల తర్వాత సంబంధిత ప్రతిపాదనలను జహంగీర్ ఆమెదించారు. ఈ ఒప్పందం మనదేశ చరిత్రగతినే మార్చివేసింది. వర్తక వాణిజ్యాలు, ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో కాలుమోపిన ఈస్టిండియా కంపెనీ ఈ దేశమంతా తన సామ్రాజ్యాన్ని నెలకొల్పుతుందనేనది అప్పటికీ ఎవరి ఊహకీ అందని విషయం. క్రమక్రమంగా, ఒక్కో ప్రాంతంలో తిష్టవేస్తూ..దేశమంతా సామ్రాజ్యాన్ని విస్తరించింది.

థామస్‌ రో ఎంతో ప్రయత్నంచేసి జహంగీర్‌ను ఒప్పించాడు. చాలాకాలం ఇక్కడే ఉండిపోయ జహంగీర్‌తో పలు దఫాలుగా చర్చించి సఫలమయ్యాడు. జహంగీర్‌ నుంచి ఫర్మానాను పొందాడు. ఈస్టిండియా కంపెనీ తన వ్యాపారాన్ని ఆరంభించడానికి అన్ని రకాలైన అనుమతులను రాజ ఆమోదాన్ని పొందగలిగారు.

చౌహాన్ రాజవంశం అనంతరం అజ్మీర్​ను రాజపుత్ర, మొఘల్, మరాఠాలు పరిపాలించారు. అజ్మీర్​ కోట అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిగా ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ అజ్మీర్ కోటలో ఉండి హల్దీఘాటి యుద్ధాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షించాడు. అనేక యుద్ధాలలో ఆరితేరిన యోధుడు, రాజపుత్రవీరుడు మాన్ తనపక్షాన యుద్ధానికి పంపించాడు.

అక్బర్‌ ఈ కోట నుంచే హల్దీఘాటీ యుద్ధాన్ని పర్యవేక్షించాడు. ఆ యుద్ధంలో పాల్గొనమని మాన్‌సింగ్‌ని పంపటం జరిగింది అనే అంశం అక్బర్‌ తాను యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా తన ప్రతినిధిగా మాన్‌సింగ్‌ని పంపారని స్పష్టమవుతోంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారాలకు జహంగీర్‌ అనుమతించడమనేది ఓ చారిత్రక అంశమైంది.

- నీర‌జ్‌ త్రిపాఠి, సర్కిల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ మ్యూజియం, అజ్మీర్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ ఇదే అజ్మీర్ కోట స్వాతంత్ర్య వేడుకలకు సాక్షిగా నిలిచింది. 1947 ఆగస్టు 14 వతేదీ అర్ధరాత్రి బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర్య ప్రదాన ప్రకటన చేశారు. ఆరోజు అర్ధరాత్రి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు జిత్మల్ లునియా అజ్మీర్ కోట మీది బ్రిటిష్ పతాకాన్ని అవనతం చేసి.. ప్రజల సమక్షంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన శుభవేళ ఈ ఖిల్లాకి సమీపంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు ఈ కోట ముందుకు చేరుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న సేనానులు, ఈ ఖిల్లాకి సమీపంలోని ఇళ్లలో నివాసముండే కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 1947లో వారందరి సమక్షంలో జాతీయ జెండా ఎగురువేశారు.

రాజస్థాన్ లో అజ్మీర్ అత్యంత కీలక వ్యూహాత్మక ప్రాంతం. ఈ కోట నుంచే యావత్ రాజపుత్రరాజ్య పరిపాలన సాగింది. అందువల్లనే దేశంలో విదేశీ పాలకులైన మొఘలులు అజ్మీరుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. బ్రిటిషర్లూ అదే పాటించారు. అజ్మీర్ కోట నీడలోనే విప్లవకారులు భారత స్వాతంత్ర్యోద్యమ వ్యూహరచన చేశారు.

ఇదీ చూడండి: భరతమాత విముక్తికి ఆత్మార్పణ చేసిన వీరనారి అవంతిబాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.