ETV Bharat / bharat

రైల్వే టికెట్ కౌంటర్​పై దొంగల కన్ను- రద్దీగా ఉండే స్టేషన్​లోనే చోరీ

Robbery In Railway Station: రైల్వే స్టేషన్​లోని టికెట్​ కౌంటర్​లో ఉండే ఉద్యోగిని కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. సుమారు రూ. 1.32 లక్షలను దోచుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని తిరువాన్మియూర్​ రైల్వే స్టేషన్​లో జరిగింది.

Thiruvanmiyur railway station
తిరువాన్మియూర్​
author img

By

Published : Jan 3, 2022, 3:37 PM IST

Robbery In Railway Station: తమిళనాడు చెన్నైలోని తిరువాన్మియూర్ రైల్వే స్టేషన్‌లో దొంగతనం జరిగింది. రైల్వే కౌంటర్​లోని ఓ ఉద్యోగిని కట్టేసి దుండగులు సుమారు రూ.1.32 లక్షలను దోచుకెళ్లారు. రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్​లో జరిగిన ఈ ఘటనతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Robbery In Railway Station
దొంగతనం జరిగిన తిరువాన్మియూర్ రైల్వే స్టేషన్​

ఇదీ జరిగింది..

తిరువాన్మియూర్​ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సోమవారం ఉదయమే కొందరు ప్రయాణికులు స్టేషన్​కు వచ్చారు. వారు టికెట్​ కోసం లైన్​లో నిలుచున్నారు. ఎంతసేపటికీ టికెట్ ఇచ్చే సిబ్బంది కనిపించలేదు. అదే సమయంలో స్టాఫ్ రూం నుంచి బిగ్గరగా అరిచిన శబ్దం వినిపించింది. అది విన్ని ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా టికెట్​ ఇచ్చే ఉద్యోగి చేతులు, కాళ్లను ఎవరో గుర్తు తెలియనివారు కట్టి పడేశారు. అది చూసిన వారు అతనికి ప్రథమ చికిత్సను అందజేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Robbery In Railway Station
దొంగతనం జరిగిన కౌంటర్​ ఇదే..!

ఉద్యోగి చెప్పిన దాని ప్రకారం దొంగలు ఆ వ్యక్తిని కట్టేసి రూ.1.32 లక్షలు దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉండే షాపుల్లో సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం కారణంగా దుండగులు ఈ సాహసం చేసి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

Robbery In Railway Station
దొంగతనంకు సంబంధించి వివరాలు అడిగి తెసుకుంటున్న పోలీసులు

ఇప్పటికే చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతి అనే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ 2016 జూన్ 24న దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన జరిగేటప్పుడు కూడా ఆ రైల్వే స్టేషన్​లో సీసీ కెమెరాలు లేవు. దీంతో నిందితుడి ఆచూకీ తెలుసుకోవడం కష్టమైందని అధికారులు గుర్తు చేశారు.

ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి అత్తమామలను చంపి.. దోపిడీ డ్రామా ఆడిన కోడలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.