కర్ణాటకలో అధికారులు తలపెట్టిన మౌలిక వసతుల కల్పన కార్యక్రమం నవ్వులపాలైంది. కొప్పల జిల్లాలో చెట్ల చుట్టూ సీసీ రోడ్లు నిర్మించిన మున్సిపల్ అధికారుల నిర్వాకం విమర్శలకు దారి తీసింది. ప్రణాళికలో లేని ప్రాంతాల్లో రోడ్లు వేసి.. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదురవుతున్నాయి.
![Road constructed around trees, Light pole constructed in drainage: Negligence by gvt officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-gvt-06-30-cmc-made-cc-road-unaturised-palce-vis-kac10005_30032021133051_3003f_1617091251_673_3103newsroom_1617196706_950.jpg)
రోడ్ల నిర్మాణానికి ముందు ఇక్కడి ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటారు అటవీ అధికారులు. అయితే వాటి చుట్టే సీసీ రోడ్లు నిర్మించారు మున్సిపల్ అధికారులు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అటవీ అధికారులకు.. విచిత్ర సమాధానం చెప్పారు. తాము చెట్లను నరికివేయబోమని చెప్పుకొచ్చారు.
అయితే, రోడ్డు నిర్మాణం పూర్తైనందున.. చెట్లను తొలగించేందుకు అనుమతించాలని జోనల్ కన్సర్వేషన్ అధికారిని మున్సిపల్ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. కానీ, రోడ్డు లేఅవుట్ను సమర్పించాలని, అప్పుడే దానికి అనుమతిస్తామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
![Road constructed around trees, Light pole constructed in drainage: Negligence by gvt officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-gvt-06-30-cmc-made-cc-road-unaturised-palce-vis-kac10005_30032021133051_3003f_1617091251_116_3103newsroom_1617196706_535.jpg)
కాలువలో కరెంటు స్తంభాలు..
శివమొగ్గలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. స్మార్ట్ సిటీ నిర్మాణ పనుల్లో భాగంగా మురుగు నీటి కాలువలో విద్యుత్ స్తంభాలు పాతారు అధికారులు. మూడు కరెంట్ స్తంభాలను డిప్యూటీ కమిషనర్ ఇంటికి సమీపంలోని కాలువలో ఏర్పాటు చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో ఈ పనులు చేపట్టిన ఇంజినీర్లపై ప్రజలు మండిపడుతున్నారు.
![Road constructed around trees, Light pole constructed in drainage: Negligence by gvt officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-smg-03-kalape-kamagari-ka10011_30032021201146_3003f_1617115306_182_3103newsroom_1617196706_918.jpg)
![Road constructed around trees, Light pole constructed in drainage: Negligence by gvt officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-smg-03-kalape-kamagari-ka10011_30032021201146_3003f_1617115306_593_3103newsroom_1617196706_1009.jpg)
ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ రెండు పనులు చూసి పలువురు నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తుండగా... మరికొందరు తెగ నవ్వుకుంటున్నారు.
ఇదీ చూడండి: కేరళ పోరులో 26ఏళ్ల అరిత ఎంతో ప్రత్యేకం!