rpf accident in rajasthan: రాజస్థాన్లోని సవాయ్ మధోపూర్ జిల్లాలో ఆర్పీఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు గాయపడ్డారు. జిల్లాలోని చౌత్ కా బర్వరా ప్రాంతంలోని ఎచర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.
జైపుర్ నుంచి బయలుదేరిన ఈ బస్సు టోంక్ మీదుగా సురేలి చేరుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఎచర్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న చౌత్ కా బర్వరా పోలీసులు గాయపడిన ఆర్పిఎఫ్ సిబ్బందిని సవాయ్ మధోపుర్ జిల్లా ప్రధాన కార్యాలయంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా.. వారిలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి