ETV Bharat / bharat

Road accident in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - Bhadradri Kothagudem District Latest Crime News

Road accident
Road accident
author img

By

Published : Jun 14, 2023, 6:14 PM IST

Updated : Jun 14, 2023, 7:34 PM IST

18:09 June 14

వంతెన పైనుంచి వాగులో పడిన టెంపో, నలుగురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం

Burgampadu Road accident today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో నలుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లా నర్సాపురం మండలం తిరుమలదేవిపేకు చెందిన మెుత్తం12 మంది భద్రాచలం దైవ దర్శనానికి వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి టెంపో వాహనం ఆంధ్ర సరిహద్దు ప్రాంతం బూర్గంపాడు శివారులో బ్రిడ్జి పైనుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులకు, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Bhadradri Kothagudem Road accident today :ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు, దుర్గారావును బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిర్మల అనే మహిళకు గాయాలవడంతో ఆమెను భద్రాచలం ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన ముగ్గురు పెద్దలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నలుగురు చిన్నారులకు గాయాలవడంతో వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా.. వీరిలో ప్రదీప్‌, సందీప్‌ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనాస్థలాన్ని బూర్గంపాడు పోలీసులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Road accidents in Nalgonda district : మరోవైపు నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నకిరేకల్-తాటికల్ ఫ్లైఓవర్ వద్ద ఆగి ఉన్న కారును.. నల్గొండవైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని.. అతివేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న ఇద్దరికి గాయలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు తాటికల్‌ గ్రామానికి చెందిన రాజు, విజయ్‌గా గుర్తించారు. ఆగి ఉన్న కారును ఓవర్ టెక్ చేసే ప్రయత్నంలో.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Road accidents in Mancherial district : మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలం గుల్లకోట జాతీయ రహదారిపై లారీ, బైకు ఢీకొని దంపతులు మృతిచెందారు. మృతులు దండేపల్లి మండలం మేదరిపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు

ఇవీ చదవండి: Nalgonda Accident Today : నీళ్ల ట్యాంకర్​ను ఢీకొట్టిన RTC బస్సు.. అందులో 43 మంది ప్రయాణికులు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ వాసులు మృతి

Last Updated : Jun 14, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.