ఉత్తర్ప్రదేశ్ బండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గిర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
![road accident in banda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7_29072022172543_2907f_1659095743_756.jpg)
![road accident in banda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7_29072022172543_2907f_1659095743_1032.jpg)
ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: Live Video: డబుల్ డెక్కర్ బస్సు బోల్తా.. మహిళ మృతి.. 50 మందికి గాయాలు