ETV Bharat / bharat

'కరెన్సీ నోట్లపై లాలూ చిత్రం ముద్రించాలి'.. ఆర్జేడీ కొత్త డిమాండ్​ - లాలూ ప్రసాద్​ లేటెస్ట్​ న్యూస్​

దేశంలో కరెన్సీ నోట్లపై దేవుడు చిత్రాలను ఉంచాలన్న అరవింద్​ కేజ్రీవాల్​ వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే బిహార్​లోని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి లాలూ ప్రసాద్​ చిత్రాలను కూడా చేర్చాలని డిమాండ్​ చేశారు. దీనిపై భాజపా ఘాటుగా స్పందించింది.

RJD demands Lalu photo on Indian currency
కరెన్సీ నోట్లపై లాలూ చిత్రాలు ముద్రించాలి
author img

By

Published : Oct 28, 2022, 10:45 PM IST

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ లేవనెత్తిన కరెన్సీ నోట్ల విషయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆ​ర్జేడీ మరో కొత్త డిమాండ్​ను తెరపైకి తెచ్చింది. దేవతల చిత్రాలకు బదులుగా ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్​ యాదవ్​, కర్పూరి ఠాకూర్ చిత్రాలను ఉంచాలని కోరారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్​ కుమార్. ఇలా చేస్తే భారతీయ కరెన్సీ విలువ తగ్గదని చెప్పారు.

మరోవైపు బిహార్ భాజపా అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్.. ఆర్జేడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'భారతీయ కరెన్సీ అనేది ఆర్జేడీ ఎన్నికల మేనిఫెస్టో కాదు. ఎవరో దేవతల ఫొటోలను పెట్టాలని కోరారు.. ఇప్పుడు మీరు లాలూ, కర్పూరి చిత్రాలను ఉంచాలని కోరుతున్నారు. మీరందరూ మీకు నచ్చిన విధంగా వ్యవహరిస్తే.. నోట్లపై తేజశ్వీ యాదవ్​ చిత్రాలను కూడా ఉంచాలని డిమాండ్​ చేస్తారు' అని ఆయన అన్నారు.

"ఈ దేశ ప్రజలు మూర్ఖులు కాదు, మనం లౌకిక రాజ్యంలో బతుకుతున్నాము. మన దేశంలో దేవతలకు, దేవుళ్లకు దేవాలయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. గాంధీ గారి చిత్రాలు ఇప్పటికే ఉన్నాయి. ఇలాంటి విషయాలపై భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. జాతీయవాదంతో రాజకీయాలు ఆడటం మానుకోండి. ఇవి కుటుంబ రాజకీయాలు కాదు.. ఇలాంటి డిమాండ్లు చేయడం మానుకోండి"

- అరవింద్ కుమార్ సింగ్, భాజపా అధికార ప్రతినిధి

ఈ డిమాండ్లపై స్పందించిన పట్నాకు చెందిన రాజకీయ నిపుణుడు డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించారు. ఇటువంటి డిమాండ్లు భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీని అవమానించడమే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణపై ఏళ్ల తరబడి కటకటాల వెనుక ఉన్న వ్యక్తి బొమ్మను పెట్టడం గురించి ఎవరైనా ఎలా ఆలోచిస్తారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడం గురించి ఆర్జేడీ నాయకులు ఆలోచించాలని ఆయన కోరారు.

దేశంలో కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మ మరో వైపు.. దేవుడి చిత్రాలు ఉంచాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ ప్రధానిని కోరారు. ఈ విషయంపై ఆయన మోదీకు లేఖ రాశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని.. దేశం అభివృద్ధి చెందాలంటే దేవుడి చిత్రాలను కరెన్సీపై ముంద్రించాలని అన్నారు కేజ్రీవాల్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.