ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో కరోనా విజృంభణ- మళ్లీ లాక్​డౌన్​

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. అయితే ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రం విపరీతంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజే మరో 15,600 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వారాంతపు సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.

Kerala
కేరళ లాక్​డౌన్​
author img

By

Published : Jul 14, 2021, 7:56 PM IST

Updated : Jul 14, 2021, 8:23 PM IST

కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ కొత్తగా 15,637 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 128 మృతిచెందారు. దీనితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 31,03,310కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 14,938కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 1,17,708 యాక్టివ్‌ కేసులున్నాయి.

మలప్పురం జిల్లాలో అత్యధికంగా 2030 కేసులు నమోదు కాగా.. కోజికోడ్​లో 2022, ఎర్నాకుళంలో 1894 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొత్తగా నమోదైన కేసుల్లో.. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన వారి ద్వారానే అత్యధిక కేసులు (14,717) వెలుగుచూసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 10.03 శాతంగా ఉందని తెలిపింది.

సంపూర్ణ లాక్​డౌన్​ దిశగా..

రోజువారీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల(జులై 17, 18) పాటు వారాంతపు సంపూర్ణ లాక్​డౌన్​ను ప్రకటించింది కేరళ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను జారీచేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం మూసివేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.

Kerala
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్​డౌన్​ ఉత్తర్వులు

ఇవీ చదవండి:

Last Updated : Jul 14, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.