ETV Bharat / bharat

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు - కొవిడ్ కేసులు

Corona Cases: మహారాష్ట్రలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం రికార్డు స్థాయిలో 1,081 కొత్త కేసులు వెలుగుచూశాయి. ముంబయి నిన్న, మొన్నటి వరకు స్థిరంగా ఉన్న కేసులు భారీగా వృద్ధి చెందడం ఆందోళన కల్గిస్తోంది. అయితే కరోనా వల్ల ఆస్పత్రిలో ఎవరూ చేరలేదని, ప్రజలు భయపడవద్దని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.

corona cases
కరోనా కేసులు
author img

By

Published : Jun 1, 2022, 6:52 PM IST

Updated : Jun 1, 2022, 8:08 PM IST

Maharashtra covid cases: మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్న, మొన్నటి వరకు స్థిరంగా నమోదైన కేసులు బుధవారం ఒక్కసారిగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. కొత్తగా 1,081 కేసులు వెలుగుచూశాయి. గత మూడు నెలల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ముంబయి, పుణె, ఠాణెలోని పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో బుధవారం నాటికి 3,475 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. అందులో దాదాపు 2,500 కేసులు ముంబయి ప్రాంతానికే చెందినవని ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపె చెప్పారు. అయితే కరోనా వల్ల ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరలేదని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Covid 19 India: దేశంలో కొద్ది నెలలుగా కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2000 నుంచి 3000 మధ్యే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ సంఖ్య మారే అవకాశం ఉంది. కరోనా మొదటి, రెండో దశల్లోనూ మహారాష్ట్రనే తీవ్రంగా ప్రభావితమైంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఆ రాష్ట్రానివే సగం ఉండేవి. ఇప్పుడు మళ్లీ అక్కడ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే విషయమే. అయితే గతంలోలా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకపోవడం ఊరటనిచ్చే అంశం. చిన్నారులు, వయోజనులు సహా అందరు టీకాలు తీసుకొని ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగింది. కరోనా వచ్చినా స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయి. పెద్దగా ఇబ్బంది లేకుండానే నయం అవుతోంది.

రెండు డోసులు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు మూడో డోసు కూడా తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే చెప్పింది. అయితే 60 ఏళ్లు పైబడిన వారికే బూస్టర్​ డోసు ఉచితంగా అందిస్తోంది. 18- 60 ఏళ్ల వారు మాత్రం ప్రైవేటు కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చని చెప్పింది. బూస్టర్ డోసు తీసుకుంటే రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతున్నందు వల్ల కరోనా మరోసారి విజృంభించినా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు లేవు.
మరోవైపు.. దేశవ్యాప్తంగా మంగళవారం 2,745 కేసులు వెలుగుచూశాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 2,236 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసులు వివరాలు ఇలా ఉన్నాయి..

  • మొత్తం కరోనా కేసులు: 4,31,60,832‬
  • మొత్తం మరణాలు: 5,24,636
  • యాక్టివ్​ కేసులు: 18,386
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,17,810

Vaccination India: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మంగళవారం 10,91,110 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,93,57,20,807 కు చేరింది. ఒక్కరోజే 4,55,314 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇదీ చదవండి: బొమ్మకు ఉరివేసి 8ఏళ్ల బాలుడి సూసైడ్​.. ఆ​ వీడియో చూసే!

Last Updated : Jun 1, 2022, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.