నిరసన తెలిపే హక్కు విషయంలో సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. నిరసన తెలిపే హక్కు అంటే ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఆందోళన చేయడం మాత్రం కాదని సుప్రీం స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో భాగంగా దిల్లీ షాహీన్ బాగ్ వద్ద ఆందోళనలు చేయడానికి వీల్లేదంటూ గతేడాది అత్యున్నత న్యాయస్థానం.. ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు కొన్ని ఆందోళనలు రావడం సహజమే అయినప్పటికీ బహిరంగ ప్రదేశంలో రోజుల తరబడి నిరసలు చేపట్టడం సరికాదంది.
ఆ నిరసనలు ఇతరుల హక్కులకు భంగం కలిగించేవేనని జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ చదనండి : 'కులాంతర వివాహాలతో కుల సమస్యలు తగ్గుతాయి'