మహారాష్ట్రలో ఓ రైస్ మిల్లు యజమాని విద్యుత్తు బిల్లు ఇచ్చిన షాక్‌కు నిర్ఘాంతపోయాడు. ఇంతకీ వచ్చిన బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఎనభై కోట్ల రూపాయలు!!
ఊహించలేనంత..
పాల్ఘర్కు చెందిన 66 ఏళ్ల గణపత్ నాయక్‌కు ఓ రైస్ మిల్లు ఉంది. ప్రతినెలా దానికి రూ.50వేలకు కాస్త అటూఇటూ బిల్లు వచ్చేది. గత సోమవారం మాత్రం ఏకంగా రూ.80,13,89,600 బిల్లు ఆయన చేతికొచ్చింది. దిగ్భ్రాంతి చెందిన ఆయన అధికారులను ఆశ్రయించారు. మరుసటి రోజు మిల్లుకు వెళ్లి పరిశీలించిన అధికారులు.. రీడింగ్ తప్పు పడినట్లు గుర్తించారు. ఆపై బిల్లును రూ.80 వేలుగా సరిచేశారు.
దీంతో ఊపిరి పీల్చుకున్న గణపత్ నాయక్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: నేపాల్ నుంచి భారీగా పెట్రోల్ స్మగ్లింగ్.. కారణమిదే!