పంజాబ్ కాంగ్రెస్(punjab congress)లో లుకలుకలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి.. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వీరికి పలువురు మంత్రులు కూడా తోడవ్వడం గమనార్హం.
మంత్రి రాజిందర్ సింగ్ భజ్వా నివాసంలో సుఖ్బిందర్ సింగ్ సర్కారియా, సుఖ్జిందర్ సింగ్ రంధ్వారా, చరణ్‌జిత్ సింగ్ ఛన్నితో పాటు 20 మందికిపైగా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 2017 ఎన్నికలకు ముందు తమకిచ్చిన హామీలను కెప్టెన్(amarinder singh news) నెరవేర్చలేదని వారందరూ ఆరోపించారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించేందుకు ఆమెను కలవాలని భేటీలో సభ్యులు నిర్ణయించారు. ఊహించని రీతిలో చర్యలు చేపడితేనే రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు మెరుగుపడుతాయని పేర్కొన్న భజ్వా.. అవసరమైతే సీఎంను కూడా తప్పించాలని తేల్చిచెప్పారు. కెప్టెన్‌ను తప్పించాలన్నది తమ ఒక్కరి డిమాండ్ కాదని.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని తెలిపారు.
కశ్మీర్ ప్రత్యేక దేశమంటూ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ(navjot singh sidhu congress news) సలహాదారుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిని తప్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండటం అధికార పక్షాన్ని మరింత క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేస్తోంది.
117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో.. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇదీ చూడండి:- పంజాబ్‌లో సిద్ధూ రాజకీయ కేళి- సీఎం పదవి కోసమేనా?