ETV Bharat / bharat

Revanth Reddy Reacts on BRS Manifesto : 'కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ కాపీ కొట్టారు' - కేసీఆర్​పై రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు

Revanth Reddy Reacts on BRS Manifesto : కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ ఒక్కో వెయ్యి పెంచుతూ కాపీ కొట్టారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఇతర ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకే కేసీఆర్‌ సమయం సరిపోతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ 6 గ్యారంటీలను చూడగానే కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారని రేవంత్​ విమర్శించారు. కేసీఆర్‌ పూర్తిగా ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకోవాలని రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు.

Revanth Reddy Reacts on BRS Manifesto
Revanth Reddy
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 5:38 PM IST

Revanth Reddy Reacts on BRS Manifesto : కాంగ్రెస్‌ 6 గ్యారంటీలను చూడగానే కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ ఒక్కో వెయ్యి పెంచుతూ కాపీ కొట్టారని మండిపడ్డారు. సొంతంగా ఆలోచన చేసే శక్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఇతర ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకే కేసీఆర్‌ సమయం సరిపోతోందని రేవంత్​ ఆరోపించారు.

Revanth Reddy Fires on KCR : తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాపై రేవంత్​రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎన్నికల కమిటీ ఎంపిక చేసిందని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్‌ తన అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారని ఎద్దేవాచేశారు. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 51 మందికే బీ ఫారాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రకటించినవి అసాధ్యం అని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారని రేవంత్​రెడ్డి ఫైర్ అయ్యారు. ఒకప్పుడు కేసీఆర్‌ అడుగుల్లో ఇతర పార్టీలు నడుస్తాయని అనేవారని.. ఇప్పుడు ఆలోచనలు క్షీణించిన ఆయన.. కాంగ్రెస్‌ను అనుసరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు సాధ్యమే అని ఇవాళ కేసీఆర్‌ రాజముద్ర వేశారని తెలిపారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతను బీఆర్ఎస్​ నేతలు కోల్పోయారని చెప్పారు. కాంగ్రెస్‌ చెప్పినవి అసాధ్యమంటూనే కొంచెం పెంచి బీఆర్ఎస్​ మేనిఫెస్టోలో పెట్టారని రేవంత్​రెడ్డి విమర్శించారు.

Telangana Congress MLA Candidates First List 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Revanth Reddy Challenge to KCR : 9 ఏళ్లల్లో దోచుకున్న రూ.లక్ష కోట్లతో జాతీయ రాజకీయాలు చేస్తానని తిరిగింది ఎవరు? అని రేవంత్​రెడ్డి నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాము డబ్బు, మద్యం పంపిణీ చేయమని ప్రమాణం చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ కూడా డబ్బు, మద్యం పంచదని కేసీఆర్‌ ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈనెల 17న అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తానని.. అదేవిధంగా కేసీఆర్‌ కూడా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈనెల 17న మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణం చేసేందుకు రావాలని కేసీఆర్‌కు రేవంత్​రెడ్డి సవాల్ విసిరారు.

'కాంగ్రెస్‌ ఇచ్చిన డిక్లరేషన్లనే బీఆర్ఎస్ కాపీ కొట్టింది. కాంగ్రెస్‌ ప్రకటించినవి అసాధ్యమని బీఆర్ఎస్ విమర్శించింది. కాంగ్రెస్‌ 6 గ్యారంటీలనే ఇప్పుడు కేసీఆర్‌ మేనిఫెస్టోలో పెట్టారు. ఒకప్పుడు కేసీఆర్‌ అడుగుల్లో ఇతర పార్టీలు నడుస్తాయని అనేవారు. ఆలోచనలు క్షీణించిన కేసీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ను అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు సాధ్యమే అని ఇవాళ కేసీఆర్‌ రాజముద్ర వేశారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతను బీఆర్ఎస్ నేతలు కోల్పోయారు. కాంగ్రెస్‌ చెప్పినవి అసాధ్యమంటూనే కొంచెం పెంచి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు.' -రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Commnets on KCR : ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు ప్రతినెల 1వ తేదీన ఇవ్వాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. జీతాలు, పింఛన్లు నవంబర్‌ 1న ఇస్తే.. మేనిఫెస్టో అమలు చేస్తారని తాము నమ్ముతామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్‌ ఎప్పుడో చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిందని.. ఆలోచనా శక్తి నశించిన కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలని రేవంత్​రెడ్డి సూచించారు. కేసీఆర్‌ పూర్తిగా ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు.

Revanth Reddy Reacts on BRS Manifesto కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ కాపీ కొట్టారు

Komatireddy Venkat Reddy on Congress MLA Tickets : 'టికెట్లు దక్కని నేతలు ఎన్నికల్లో సహకరించాలి'

Telangana Congress Bus Yatra 2023 : ఈనెల 18 నుంచి కాంగ్రెస్​ బస్సు యాత్ర.. కొండగట్టు నుంచి ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.