ETV Bharat / bharat

'కరోనా ఉద్ధృతి.. మోదీ సృష్టించిన విపత్తు' - మోదీ రాజీనామాపై మమత

దేశంలో కరోనా ఉద్ధృతి ప్రధాని మోదీ సృష్టించిన విపత్తుగా అభివర్ణించారు బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ. కరోనా కట్టడిలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

mamata benarjee
మమతా బెనర్జీ
author img

By

Published : Apr 21, 2021, 8:21 PM IST

దేశంలో కరోనా విజృంభణ ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన విపత్తుగా అభివర్ణించారు మమతా బెనర్జీ. కరోనా కట్టడిలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామాచేయాలని మరో సారి డిమాండ్ చేశారు.

" బంగాల్ రాష్ట్ర వెన్నెముకను భాజపా విరవడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ల(భాజపా) వెన్నెముకను విరవడం మాకూ తెలుసు. మోదీ పై పోరాడడానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. బంగాల్.. బంగాల్ టైగర్ జన్మస్థలం. బంగాల్ టైగర్ లా పోరాడతాం . మేము చాలా చేశాం. భాజపాను తరిమేయడమొక్కటే మిగిలి ఉంది.".

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు మమత. రాష్ట్రంలో అందరికీ మేలుచేశామని, మూడో సారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: బంగాల్ దంగల్​: ఆరో విడతలో 43స్థానాలకు పోలింగ్​

బంగాల్​లో ఫలితాల లెక్కలను కరోనా మార్చేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.