ETV Bharat / bharat

సువేందు అధికారి రాజీనామా ఆమోదం - భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్

ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్​ బీమన్​ బెనర్జీ ఆమోదం తెలిపినట్లు భాజపా​ నేత సువేందు అధికారి ప్రకటించారు. మరోవైపు భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్​ భార్య సుజాత మండల్​ ఖాన్ టీఎంసీలో చేరారు.

suvendu
సువేందు అధికారి రాజీనామా ఆమోదం
author img

By

Published : Dec 21, 2020, 4:05 PM IST

బంగాల్​ శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాకు స్పీకర్​​ ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు సువేందు అధికారి. తన రాజీనామాపై చర్చించేందుకు ఇవాళ అసెంబ్లీ స్పీకర్​​ బీమన్​ బెనర్జీని కలిసిన నేపథ్యంలో ఆమోదం లభించినట్లు తెలిపారు.

" ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై వివరణ ఇచ్చేందుకు తనను కలవాలని అసెంబ్లీ స్పీకర్​ ఆదేశించారు. ఈరోజు ఆయన్ను కలిశాను. రాజీనామా లేఖ స్వచ్ఛందంగా, సొంతంగానే అందించారా? అని అడిగారు. నేను అవునని చెప్పాను. ఈ క్రమంలో నా రాజీనామా అంగీకరించినట్లు చెప్పారు."

- సువేందు అధికారి, భాజపా నేత

బంగాల్​ అధికార తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి, ఇతర పదవులతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి.. ఇటీవలే భాజపాలో చేరారు సువేందు. అయితే.. సువేందు రాజీనామా పత్రంలో తేదీ స్పష్టంగా పేర్కొనలేదని కొద్దిరోజుల క్రితం తెలిపారు బంగాల్ అసెంబ్లీ స్పీకర్ బీమన్ బెనర్జీ. రాజీనామాను సువేందు స్వయంగా సమర్పించలేదని.. ఈ కారణంగా అది నిజమైనదని, స్వచ్ఛందంగా చేశారని నిర్ధరించడం కష్టమని పేర్కొన్నారు.

టీఎంసీలోకి భాజపా ఎంపీ భార్య..

బంగాల్​లో ఇటీవల టీఎంసీ నుంచి భాజపాలోకి భారీగా వలసలు పెరిగాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్ర భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్​ భార్య సుజాత మండల్​ ఖాన్.. కాషాయ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తూ టీఎంసీలో చేరారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో తన భర్త విజయం కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ ఎలాంటి గుర్తింపు లేదని.. అందుకే పార్టీ మారుతున్నట్లు చెప్పారు సుజాత మండల్​. "పార్టీకి నమ్మకంగా ఉన్నవారిని వెనక్కి నెట్టి ఇటీవలే కాషాయ పార్టీలో చేరిన అవినీతి నాయకులకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు" అని ఆరోపించారు.

suvendu
భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్​ భార్య సుజాత మండల్​ ఖాన్

ఇదీ చూడండి: వచ్చే ఎన్నికల్లో భాజపాదే అధికారం: సువేందు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.