క్యాన్సర్‌కు దారితీసేలా శరీర కణాల్లో జరుగుతున్న మార్పులను గుర్తించే సరికొత్త విధానాన్ని ఐఐటీ-మద్రాసు పరిశోధకులు రూపొందించారు. ఇది కృత్రిమ మేధ (ఏఐ)తో నడిచే గణిత అల్గారిథం. దీని ద్వారా డీఎన్‌ఏను విశ్లేషించి, జన్యుపరమైన మార్పులను గుర్తించడం సాధ్యపడుతుంది.
"క్యాన్సర్ కణాల వృద్ధికి దోహదపడే 'డ్రైవర్' మార్పులకూ, వ్యాధిపై ఎలాంటి ప్రభావం చూపని పాసింజర్ మార్పులకూ మధ్య వ్యత్యాసం ఉంటోంది. పరిశోధకులకు పెద్ద సవాలుగా నిలుస్తున్నది ఈ అంశమే. డ్రైవర్ మ్యూటేషన్లను గుర్తించేలా ఏఐ ఆధార గణిత అల్గారిథంను తయారుచేశాం. దీని ద్వారా వ్యాధి తీవ్రతకు దోహదపడే కణాలను లక్ష్యంగా చేసుకుని, చికిత్స అందించవచ్చు. ఫలితంగా రోగికి సరైన సమయంలో, సరైన ఔషధాన్ని అందించడం సాధ్యపడుతుంది" అని పరిశోధనకర్త, ఐఐటీ-మద్రాస్‌లోని రోబర్ట్ బోష్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి.రవీంద్రన్ వివరించారు.
ఇదీ చూడండి: ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం