ETV Bharat / bharat

యూపీ శకటానికి ఉత్తమ అవార్డు.. రెండో స్థానంలో కర్ణాటక

author img

By

Published : Feb 5, 2022, 7:04 AM IST

UP tableaux award: గణతంత్ర దిన కవాతులో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర శకటానికి ఉత్తమ అవార్డు దక్కింది. కర్ణాటక శకటం ద్వితీయ స్థానంలో నిలిచింది.

UP tableaux award
యూపీ శకటం

UP tableaux award: దేశ రాజధానిలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్న 73వ గణతంత్ర దిన కవాతులో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర శకటానికి ఉత్తమ అవార్డు లభించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. ‘కాశీ విశ్వనాథ్‌ ధామ్‌’ పేరిట ఈ శకటాన్ని రూపొందించారు. సంప్రదాయ చేనేత ఉత్పత్తుల ఇతివృత్తంతో రూపొందిన కర్ణాటక శకటం ద్వితీయస్థానం దక్కించుకోగా, మేఘాలయ మూడోస్థానంలో నిలిచినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రంగా ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ ఈశాన్య రాష్ట్రం మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఇతివృత్తంతో శకటాన్ని తీర్చిదిద్దింది.

  • కేంద్ర మంత్రిత్వశాఖల విభాగంలో విద్య, పౌర విమానయాన శాఖల శకటాలు సంయుక్త విజేతలుగా నిలిచాయి. మొత్తం తొమ్మిది శాఖలు ఈ విభాగంలో పోటీపడగా.. ప్రజల ఎంపికలో సమాచార మంత్రిత్వ శాఖ విజేతగా నిలిచింది. పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణశాఖ శకటం ప్రత్యేక బహుమతి దక్కించుకొంది.
  • త్రివిధ దళాల కవాతులో నౌకాదళం ప్రథమ బహుమతి గెలుచుకొన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: పక్కా స్కెచ్​తోనే గోరఖ్​పుర్​ బరిలో యోగి- 62 సీట్లపై భాజపా గురి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.