కొంతమంది తాలిబన్ నేతలతో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవిగా అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. భవిష్యత్తులో భారత్‌తో తాలిబన్ల సంబంధాలు పాకిస్థాన్ అభిప్రాయాలు, కోరికల మీద ఆధారపడి ఉండవంటూ ఆ సంస్థ నేతలు.. మంత్రికి చెప్పినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వాటిని నమ్మొద్దంటూ మంగళవారం స్పష్టం చేశాయి.
"రానున్న సెప్టెంబర్ 11 నాటికి అఫ్గానిస్థాన్ నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించాలని అమెరికా భావిస్తోంది. దీంతో అఫ్గాన్ శాంతి ప్రక్రియకు సంబంధించిన పరిణామాలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో తాలిబన్లు జట్టు కట్టడం అఫ్గానిస్థాన్ భవిష్యత్తుకు అన్నివిధాలా ప్రయోజనకరమంటూ ఇటీవల ఓ వెబినార్‌లో ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు. దీంతో ఇలాంటి తప్పుడు నివేదికలు వెలువడటానికి అవకాశం ఏర్పడింది" అని అధికారిక వర్గాలు వివరించాయి.
ఇదీ చూడండి: ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రుల భేటీ