ETV Bharat / bharat

'నీళ్లు కలిపితే 5.. లేదంటే 18 శాతం జీఎస్​టీ!' - ఏఏఆర్ జీఎస్​టీ అంశం

రెడీ-టు-కుక్ ఆహార పదార్థాలైన ఇడ్లీ, దోశ మిక్స్‌ పౌడర్ విక్రయాలపై 18 శాతం జీఎస్​టీ విధించాల్సి ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) పేర్కొంది. ఇవే పదార్థాలను బ్యాటర్(తడి పిండి) రూపంలో విక్రయిస్తే మాత్రం జీఎస్​టీ 5 శాతంగా ఉంది.

'ఆ పదార్థాలపై 18శాతం జీఎస్​టీ ఉండాల్సిందే'

author img

By

Published : Aug 8, 2021, 5:16 PM IST

దోశ, ఇడ్లీ, జావ మిక్స్ వంటి ఆహార పదార్థాలను పౌడర్(పొడి పిండి) రూపంలో విక్రయిస్తే 18 శాతం పన్ను విధించాల్సిందేనని తమిళనాడు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేసింది. ఇవే పదార్థాలను నీటితో కలిపిన పిండి(బ్యాటర్) రూపంలో అమ్మితే మాత్రం జీఎస్​టీ 5 శాతంగా ఉంటుందని తెలిపింది.

జొన్నలు, సజ్జలు, రాగులు, తృణధాన్యాలను మిశ్రమం రూపంలో విక్రయిస్తే.. వాటి వర్తించే జీఎస్​టీకి సంబంధించి కృష్ణ భవన్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ అనే సంస్థ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)ను ఆశ్రయించింది. ఈ మేరకు తమిళనాడు ఏఏఆర్ బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తీర్పులో భాగంగా ఏఏఆర్ తాజా వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థ విక్రయించే ఉత్పత్తులన్నీ పౌడర్ రూపంలో ఉన్నట్లు ఏఏఆర్ గుర్తించింది.

"దోశ, ఇడ్లీ మిశ్రమాలను పౌడర్(పొడి పిండి) రూపంలో విక్రయిస్తున్నారు. వీటిని వినియోగదారులు నీరు లేదా పెరుగుతో కలిపిన తర్వాత ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది తడి పిండి(బ్యాటర్)గా మారుతుంది. మీరు విక్రయిస్తున్న ఉత్పత్తులు పౌడర్ రూపంలో ఉన్నాయి. బ్యాటర్ రూపంలో కాదు. మీరు పేర్కొన్న 49 ఉత్పత్తులపై.. సీటీహెచ్ 2016 నిబంధనల ప్రకారం 9 శాతం సీజీఎస్​టీ, 9 శాతం ఎస్​జీఎస్​టీ వర్తిస్తుంది."

-ఏఏఆర్ ఆదేశాలు

కృష్ణ భవన్ అనే సంస్థ దోశ, ఇడ్లీ మిశ్రమాలను ప్యాక్ చేసి పొడిగా విక్రయించేది. అందుకుగాను ఐదు శాతం జీఎస్​టీ చెల్లించేది. అయితే ఏఏఆర్ తాజా తీర్పు.. పన్ను వ్యవస్థలో సందిగ్ధతకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: 'ఫాంటా' ఆమ్లెట్​.. ట్రై చేయండి ఒకసారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.