లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రవ్‌నీత్ సింగ్ బిట్టూ నియమితులయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం గురువారం ఆయన నియామకాన్ని ఖరారు చేసింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరీ పశ్చిమ బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. రెండు నెలల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున అధీర్ స్థానంలో బిట్టూను నియమించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగొయ్ కూడా అసోం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున లోక్‌సభ సమావేశాల్లో బిట్టూ పార్టీ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రవ్‌నీత్ సింగ్ బిట్టూకు అభినందనలు తెలిపింది.
2009, 2014, 2019లో ఎంపీగా గెలుపొందిన బిట్టూ.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత బియాంత్ సింగ్ మనవడు.
ఇదీ చదవండి:'భారత్ ఇక ప్రజాస్వామ్య దేశం కాదు'